రెండెంకెల వృద్ధిలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహిస్తోంది. విదేశీ మారక ద్రవ్యం రాబట్టే పంటల్లోఅగ్రస్ధానం ఆక్వాదే . జిల్లాలోని రీరప్రంత మండలల్లో అధికారికంగా, అనధికారికంగా సుమారు ఇరవై వేల ఎకరల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.గత రెండెళ్ళుగా వాతావరఁఅం అనుకూలించక , రొయ్య పిల్లల్లో నాణ్యత లేక ఈ రైతులు నష్టం చవి చూస్తున్నారు. ఈ నేపధ్యంలో జీఎస్ టీ విధానం అమలుచేయడం వల్ల మరింత భారం పడే అవకాశం ఉందని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆక్వా సాగుకు వినియోగించే మేత , ఏరియేటర్లు , ఇతర రసాయనాలు 5 నుంచి 18 శాతంచొప్పున జీఎస్ టీ పరిధిలోకి రానున్నాయి. పెరిగిన పన్ను భారం అంతిమంగా రైతుపైనే పడుతుంది. గత నెల రోజులుగా కౌంటు ధరలు రూ. 100 చొప్పున తగ్గాయి. జీఎస్ టీ అమలు ద్వారా సాగుకు ఉపయోగించే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ధరలు లేక అల్లాడుతున్న రైతాంగానికి ఇప్పుడు పెట్టుబడులు కూడా పెరగడం భారం కానుంది.
Source: eenadu