బిట్రగుంట / అల్లూరు: తీరంలో వెనామీ సాగుచేస్తున్న రైతులను ‘ లూజ్ షెల్ సిండ్రోమ్’ వణికిస్తోంది.రొయ్యల్లో నెమ్మదిగా ప్రారంభమై కండరాలను క్షీణింపచేసే ఈ వ్యాధి కారణంగా పంటకాలం పూర్తికాక ముందే గుంతలో పట్టుబడి చేయాల్సి వస్తుండటంతో దిగుబడి తగ్గి ఆక్వా రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. వ్యాధికి కారణాలు అంతుబట్టకపోవడం , నివారణకు నిర్ధిష్టమైన మందులు లేకపోవడం వంటి సమస్యలు ఆక్వా రైతులకు శాపంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలో వైట్ స్పాట్ తర్వాత లూజ్ షెల్ సిండ్రోమ్ సమస్యే ఎక్కువగా ఉంది. ప్రధానంగా కావలి, అల్లూరు, బోగోలు మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో గుంతలు , లూజ్ షెల్ , వైట్గత్ సమస్యలతో సతమతమవుతున్నారు.
లక్షణాలు:
వెనామీలొ రొయ్య పిల్ల 5 నుంచి 30 గ్రాముల బరువు వరకు ఏ దశలొ అయునా లూజ్ షెల్ వ్యాధి రావచ్చో . దీని కారణంగా రొయ్యల్లో కండరాలు క్షీణించి మెత్తగా మారడం , ఈ వ్యాధితో పాటు ఇఅతర వ్యాధులు కలిసి ఉండటం , ఎక్కువ రోజులు కొనసాగటంతో దీన్ని శాస్త్ర పరిభాషలో క్రానిక్ లూజ్ షెల్ సిండ్రోమ్ పిలుస్తారు . చెరువులో రొయ్యలను వదిలిన 25 – 30 రోజుల నుంచి పట్తుబడి చెసే వర్కు ఏదశలో అయునా ఈ వ్యాధి రావచ్చు దీని కారణంగా రొయ్యల్లో ఆకలి, ఎదుగుదల మందగించి రొయ్యలు చనిపోవడం జరుగుతోంది. పంట కాలం పూర్తవకముందే పట్టుబడి చేయాల్సి రావడంతో త్రీవంగా నష్టపోవాల్సి వస్తోందని ఆక్వా రైతులు చెబుతున్నారు.
దశలు:
క్రానిక్ లూజ్ షెల్ సిండ్రోమ్, వ్యాధి వైట్ గట్ , వైట్ ఫీసిన్ , లూజ్ షెల్ అనే మూడు దశల్లో ఉంటుంది. వైట్ గట్ దశలో పేగు కణాలు చెడిపోవడంతో లోపలి పేగు తెల్లగా మారుతుంది. వెంటనే వైట్ ఫీసిన్ దశ ప్రారంభమవుతుంది. ఈ దశలోరొయ్య పేగు తో పాటు జీర్ణ గ్రంధి కూడా చెడిపోయి తెల్లగా మారిపోతుంది. రొయ్య ఈదుతున్నప్పుడు వెనుక భాగంలో తెల్లటి దారాల్లా మలతంత్రువులు వేలాడుతుంటాయి. ఈ దశ నుంచి క్రమంగా లూజ్ షెల్ దశకు చేరుకుంటాయి. లూజ్ షెల్ దశకు చేరుకున్న రొయ్యలు ఉదయం సాయంత్రం వేళల్లో చెరువు అంచుకుచెరుకొని నెమ్మదిగా కదులుతుంటాయి . శరీరం సహజ రంగు కొల్పోతుంది రొయ్యపిల్ల పై భాగంలో పరీక్షగా గమనిస్తే మట్టి, బ్లూ, గ్రీన్ ఆల్గే తంతువులు , బాహ్య పరాన్న జీవులు అంటి పెట్టుకుని కనిపిస్తాయి. మొప్పలు మట్టి రంగులో ఉంటాయి కండరాలు క్షీణించిపోవడం తో రొయ్య మెత్తబడిపొయి కండరం కరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
కారకాలు: వ్యాధి కారకాలు నిర్ధిష్టంగా కనిపెట్టలేకపోయినా కొన్ని కారకాలు మాత్రం గుర్తించారు. ఈ వ్యాధి ఎక్కువగా బ్లూ, గ్రీన్ ఆల్గే ఎక్కువగా ఉన్న చెరువుల్లో వ్యాపిస్తున్నట్లు ఆక్వా నిపుణులు చెబుతున్నారు. విషపూరితమైన బ్లూ, గ్రీన్ ఆల్గే లను రొయ్యలు ఆహారంగా తీసుకున్నప్పుడు పేగుల్లో విషపదార్ధాలు విడుదలై కణాలు చెడిపోతున్నాయి. నాసిరకం సీడ్ కారణంగా వ్యాధినిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉండి వెంటనే ప్రభావం చూపుతుంది. ఈ క్రమమ్లో విబ్రియో బ్యాక్ట్రీయా కూడా ఎక్కువైతే రొయ్యలు తెలుపు రంగులోకి మారి వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది.
యాజమాన్య పద్ధతులతోనె నివారణ
రొయ్యలసాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల పాటించడం ద్వారానే క్రానిక్ లూజ్ షెల్ సిండ్రోమ్ ను నివారించవచ్చని ఆక్వా రంగ నిపుణులు చెబుతున్నారు. పంట పూర్తయిన తర్వాత కనీస విరామం పాటించడం , చెరువును బాగా ఎండబెట్టి పాత మట్టిని తొలగించడం ,స్టాకింగ్ తగ్గించడం , నాణ్యమైన సీడ్ ను ఎంపిక చేసుకోవడం , విషపూరితమైన బ్లూ, గ్రీన్ ఆల్గే పెరుగుదలను ప్రేరేపించి మినరల్ ఎరువుల వాడకాన్ని తగ్గించడం వంటి చర్యల ద్వారా వ్యాధిని అరికట్టవచ్చు వీటితో పాటు జీర్ణ గ్రంధి పని తీరును మెరుగుపరిచేందుకు మేతతో పాటు ఫీడ్ ప్రోబయో టిక్స్ , ప్రీబయాటిక్స్, పైటోబయాటీక్ మందులవాడకం ద్వారా రొయ్యల్లో వ్యాధి తీవ్రతనుతగ్గుంచవచ్చు