అమరావతి: అనధికారికంగా వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్పు చేయడాన్ని నియంత్రించేందుకు , ఆక్వా కల్చర్ లో స్దిరమైన వృద్ధి సాధించేందుకు జోన్ ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉన్నత స్ధాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆక్వా సాగుకు విధ్యుత్తు సరఫరా,రవాణా సదుపాయం , చెరువుల్లో నుంచి లోపలికి , బయటికు వెళ్లే నీటి వ్యవస్ధ, అనుమతుల జారీ లాంటి వాటిని గాడిలో పెట్టేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈకమిటీకి మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, మత్స్య శాఖ కమిషనర్ కన్వీనర్ , సభ్యుడిగా 9 మమదిని సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటు చేశారు.
Source : eenadu