For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యో మొర్రో

img

రొయ్యో మొర్రో
మరింత దిగజారిన ధరలు

కలిదిండి, న్యూస్టుడే : రొయ్యల ధరల పతనం కొనసాగుతోంది. మే మొదటి వారంలో రూ.230 ఉన్న 100 కౌంటు ధర నెలాఖరునాటికి రూ.220కి పడిపోయింది. నెల రోజుల వ్యవధిలో రూ.10 తగ్గింది. ఆదివారం మరో రూ.10 తగ్గి పోయి రూ. 210కి పడిపోయింది. ఆ తరవాత కౌంట్లపైనా రూ.10 చొప్పున తగ్గినట్లే. రొయ్యలు 100 కౌంటు రావాలంటే సగటున రూ.220-240 వరకు ఖర్చవుతుంది. అదే సమయంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, వ్యాధుల తాకిడికి అత్యవసర పట్టుబడులు చేయాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయారు. 'ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రొయ్యల దిగుమతులపై యాంటీ డంపింగ్ టాక్స్ వేశారు. ఈ పన్ను కొన్ని కంపెనీలకే వర్తిస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని అన్ని కంపెనీలు ధరలు తగ్గించేశాయి. దీనిపై ఉప సభాపతి రఘురామకృష్ణరా జును కలిశాం. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం' అని ఉమ్మడి జిల్లాల రొయ్యల రైతు సంఘం అధ్యక్షుడు నంబూరి గజపతిరాజు వివరించారు.

Languages

Shares

Related News