ఆక్వా పరిశ్రమ కు పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపిస్తోంది . అధికారక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా దాదాపు పది వేల ఎకరాల్లో ఈ సాగు ఉంది . టంగుటూరు , సింగరాయకొండ , చిన గంజాం , చీరాల , ఉలవపాడు , గుడ్లూరు , కొత్త పట్నం , వేటపాలెం , చీరాల , ఒంగోలు మండలాల పరిధిల్లో ఎక్కువ . గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానంగా చిన్న కౌంటు ధరలు మార్కెటులో ఆశాజనకంగా ఉండటంతో రైతులు అనడాన్ని వ్యక్తం చేస్తున్నారు .ఇది పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ఊతమిస్తోంది .ఇదే పరిస్ధితి కొనసాగితే ప్రతికూల వాతావరణంతో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు .సాధారణంగా జనవరి , ఫిబ్రవరి నెలల్లో పిల్లలను చేతుల్లో వదిలి సాగు ప్రారంభిస్తారు .ఈ సమయంలో ఉత్పత్తి తక్కువగా ఉంటోంది కాబట్టే ధరలు పరుగుతున్నాయని ఇటు నిపుణులు , అటు రైతులు పేర్కొనడం గమనార్హం . మార్కెటులో 100 కౌంటు ధర రూ .270 పైనే పలుకుతోంది .విదేశాల నుంచి ఆర్దార్లు ఎక్కువగా ఉంటున్నాయని కొందరు వ్యాపారులు చెబుతున్నారు .
నష్టాలు తగ్గే అవకాశం
వేటపాలేనికి చెందిన ఆక్వా రైతు కారణం మురళీ కృష్ట మాట్లాడుతూ గడచినా దశాబ్దన్నారుగా రొయ్యల సాగు చేస్తున్నాను . సీడ్ నాణ్యత లేకపోవడం , వైరస్ తదితర కారణాల వాళ్ళ దిగుబడులు తగ్గుతున్నాయి .ప్రస్తుతం ధరలు చూస్తే నష్టాలు ఉండే అవకాశం చాలా తక్కువ .ఆక్వా రంగానికి అనుకూల పరిస్ధుతులు ఏర్పడుతున్నాయి .కరోనా సమయంలో 1౦౦ కౌంటు ధర రూ 2౩౦ వరకు ఉండేది .ప్రస్తుతం కిలో కి రూ .40 వరకు పెరిగింది .అని పేర్కొన్నారు
source : eenadu