For Advertisement Enquiries Please Contact +91 7901268899

మత్స్య శాఖలో ఆక్వా కల్చర్(జోన్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ)

img

ఆక్వా ఉత్పత్తులను రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో ఉన్న ఆక్వా లేబొరేటరీలన్నింటిని తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం .ఇప్పుడు కొత్తగా జోనింగ్ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ చేయాలని భావించే రైతులకు కొన్ని చోట్ల వ్యవసాయం చేసే వారి నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం చేస్తున్న ప్రదేశాల్లో రొయ్యలు, చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని అధిగమించడం కోసం ప్రభుత్వం కొత్తగా ఆక్వా జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జోన్ల వ్యవస్థతో ఆక్వా కల్చర్‌ వైపు మొగ్గు చూపే రైతులు అనుమతులు తీసుకునే సమయంలో నిబంధనలను కొంత వరకూ సడలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.జోన్లు వల్ల రైతులను ఎక్కువ శాతం ఆక్వా కల్చర్‌ వైపు ఆకర్షించడమే కాకుండా. ఆక్వా ఉత్పత్తులను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే జిల్లాల్లో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్‌ ఉండే ప్రదేశాలను ఆక్వా జోన్లుగా ప్రకటించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ అధికంగా ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొదట విడతగా జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల్లో ఎక్కువ ఆక్వా కల్చర్‌ ఎక్కడ జరుగుతుందో గుర్తించి ఆ ప్రదేశాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటిస్తారు. జోన్లుగా ప్రకటించిన ప్రదేశాల్లో 65 నుంచి 70 శాతం ఆక్వా కల్చర్‌ ఉండాలి.జిల్లాల వారిగా జోన్లును గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. కమిటీలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆయనతో పాటు విజయవాడలో ఉండే రీజనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్‌, విశాఖపట్నంలో ఉండే సిఎంఎ్‌ఫ్ఆర్‌ఐ రీజనల్‌ సెంటర్‌ సైంటిస్ట్‌ ఇన్‌చార్జితో పాటు జిల్లా మత్స్యశాఖ అధికారి మెంబర్లుగా ఉం టారు. కమిటీల్లో జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారి మారుతారు. మిగిలిన మెంబర్లు అందరూ జిల్లాలన్నింటికి ఒక్కరే ఉంటారు. source: ఆంద్రజ్యోతి

 

Languages

Shares

Related News