ఆక్వా రైతు సంక్షేమం లాభసాటి వ్యవసాయం పేరిట 2017-18 ఆర్ధిక సంవత్సరంకు గాను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో రూ. 18214 కోట్లు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం 1.17 లక్షల హెక్టార్లకు చేరుకుంది. 22,034 హెక్టార్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను కోస్తాఆక్వాకల్చర్ అధారటీ విడుదల చేసింది. మంచినీటి రొయ్యల సాగు 95,703 హెక్టార్లలో చేపట్టడానికి మత్స్యశాఖ రిజిస్ట్రేషన్ పత్రాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మత్స్యశాఖకు రూ.282 కోట్లుప్రవేశపెట్టారు.