చలి తీవ్రతతో ఉష్ణోగ్రత పడిపోవడం మనుషులకే కాదు ... చేపలు, రొయ్యలకు కూడా ప్రమాదకరమే . శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి జీవులో తక్కువగా ఉంటుంది. చేపలు, రొయ్యల్లో మరింత తక్కువగా ఉంటుంది .దింతో బ్యాక్టీరియా, వైరస్ల బారి నుండి ఇవి మూర్త్యువాత పడుతుంటాయి . చేపలు, రొయ్యల్లో ఈ కాలంలో వచ్ఛే వ్యాధులు, వాటి లక్ష్యణాలు , నివారణ పద్ధతులను మత్స్యశాఖ అధికారులు డాక్టర్ ఫై.రామ్మోహనరావు , కైకలూరు సహాయ మత్స్యశాఖ అధికారి ఎల్ బీ ఎస్ వర్ధన్ వివరించారు . మొదట్లో కొల్లేరు ప్రాంతంలో చేపలు , రొయ్యల సాగు లాభాలతో ఉండేది .ప్రస్తుతం పలు రకాలవ్యాధులతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది . ప్రధాన కారణం సాగు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ఒకే తల్లి చేప నుంచి పిల్లలను ఉత్పత్తి చేసినప్పుడు . అదే జన్యువు కొనసాగడం వాళ్ళ రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నాయి. దేంతో త్వరితగతిన వ్యాధుల బారిన పడుతున్నాయి . శీతాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది .
రొయ్యల్లో : శీతాకాలంలో ప్రధానంగా విబ్రియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. గతంలో శీతాకాలంలో నే తెల్ల మచ్చల వ్యాధి వఛ్చిటైగర్ రొయ్యలు సాగు చేసే రైతులు రూ. కోట్లలో నష్టపోయారు .వెనామీ రొయ్యలో కూడా వైరస్ , బ్యాక్టీరియా వ్యాధులు సంక్రమిస్తున్నాయి వీటిలో తెల్ల మచ్చ వ్యాధి , విబ్రియో , ఇ హెచ్ పీ, వైట్ గట్ , వైటీఫిసస్ ,రన్నింగ్ మోర్టాలిటీ వంటి వ్యాధులు రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారు .
కారణాలు : అధిక సాంద్రతలో రొయ్యల్ని పెంచడం , మెటా యాజమాన్య , నియతి యాజమాన్యాలను శాస్త్రీయంగా పాటించకపోవడం , చెరువు అడుగున వ్యర్ధాలు పేరుకుపోవడం , కాలుష్యం వాళ్ళ వ్యాధులు ప్రబలుతున్నాయి . శీతాకాలంలో రొయ్యలకు సంక్రమించే వ్యాధుల్లో విబ్రియో జాతి బ్యాక్టీరియా వ్యాధి ప్రధానమైనది . వీటిలో కుడా విబ్రియో హార్వే , విబ్రియో పారా ,హీమోలైటికాస్ , విబ్రియో వాల్నికస్ , విబ్రియో ఆల్టైనోలైటి సా , విబ్రియో ఏఁగ్విల్లారం అనే రకాలున్నాయి వీటి వాళ్ళ సంక్రమించే వ్యాధిని, పియినిడ్ బ్యాక్టీరియల్ సెప్టిసీమియా అని, ఎరుపు వ్యాధి అని పిలుస్తుంటారు . ఈ వ్యాధి రొయ్యల అన్ని దశల్లో సోకుతుంది . శీతాకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్న రొయ్యల చెరువుల్లో ఈ బ్యాక్టీరియా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది .
లక్షణాలు : రొయ్యల్లో ఆకలి మందగించడం , కాళ్ళు కొరకడం , నల్లగా , ఎర్రగా మారుతుంటాయి . బాహ్యకవచం పెళుసుగా తయారై గాఢ వర్ణం లోకి మారుతుంది .శరీరం ఎర్రబడుతుంది . హిపాటో ప్రాంక్రియాస్ పాలిపోతుంది మరణాలు తక్కువ సంఖ్యలో మొదలై క్రమేపి అధికమవుతాయి శరీరం మెరుస్తుంది . హేచరీల్లో కూడా విబ్రియోసిస్ బెడద ఎక్కువగా ఉంటుంది తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయిన గుడ్ల నుంచి విడుదలయ్యే నాప్లియస్ ,జూవియా ,మైసిన్ , పిఎల్దశల్లో ఈ బ్యాక్టీరియా మూకుమ్మడిగా దాడి చేసి మరణాలకు దారి తీస్తుంది. తల్లి రొయ్యల విసర్జితాల వల్లఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏటా విబ్రియో హార్వే బ్యాక్టీరియా వల్ల వచ్ఛే మెరుపు వ్యాధి వల్ల 30 శాతంపిల్లలు మరణిస్తున్నట్లు అంచనా .
నివారణ చర్యలు :
ఎక్కువగా న్నిటిని మార్చుతుండాలి . పటిష్టమైన నేటి వడపోత , క్లోరినేషన్ చేయాలి . రొయ్యల గుడ్లను అయోడిన్ , ఫార్మలిన్ వంటి ద్రావణాలతో శుద్ధి చేయాలి . అల్ట్రా వయోలైట్ ఫిలీటర్లు ద్వారా న్నిటిని వడకట్టాలి ప్రోబయోటిక్స్ వాడాలి . చెరువులు, త్యాంకుల అడుగు భాగాల్లోని విసర్జనాలు ఎప్పటికప్పుడు తొలగించాలి పెట్టుబడి చేసిన తరువాత చెరువులను ఎండబెట్టాలి. బ్లీచింగ్ , సున్నం కలిపినా మిశ్రమాన్ని చల్లాలి.బయో రెమిదియేటర్లు ప్రోబైయటిక్స్ క్రమం తప్పకుండా వాడాలి.మేతలు వృధా కాకుండా వాడాలి . నీటి యాజమాన్యం పాటించాలి. సాగు సమయంలో వ్రిబ్రియో పరిమిషాలు చేయించాలి.