For Advertisement Enquiries Please Contact +91 7901268899

టైగర్ డాన్ ....!

img

ఒంగోలు : ఆక్వా సాగులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి .కొత్త రకం సీడ్ ల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది .ప్రస్తుతం సరికొత్తగా టైగర్ లోనే నల్లజాతి రొయ్యల్లో ఒకటైన మోనో డాన్ సీడ్ ఆక్వా రైతుల్లో సరికొత్త ఆశలు రేపుతోంది .ఈ సీడ్ కోసం రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు . ఆ సీడ్ కు మంచి పేరు రావడంతో ఎగబడుతున్నారు . కానీ , మోనో డాన్ మాత్రం రైతులకు అందనంత దూరానికి వెళ్ళిపోతుంది . నల్లజాతి టైగర్ రకానికి చెందిన ఈ సీడ్ ను లాటిన్ అమెరికా దేశాల్లో ఉత్పత్తి చేశారు .అక్కడి నుంచి అణా దేశానికి బ్రూడర్స్ దిగుమతి చేసుకుని గుజరాత్ కు చెందిన హేచరీ నిర్వాహకులు తమిళనాడులో ఒక హేచరీ , ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరొక హేచరీ నెలకొల్పారు .క్కుత్ రంగంలో కొత్త సీడ్ వచ్చినప్పుడు రైతులు ఆ దిశగా అడుగులు వేశారు . ప్రస్తుతం మోనో డాన్ వైపు కూడా అత్యంత మక్కువ చూపుతున్నారు . దీంతో లాటిన్ అమెరికా లోని ఈక్విడార్ నుంచి మోనో డాన్ రొయ్యల బ్రూడర్స్ దిగుమయి చేసుకుని సీడ్ ఉత్పత్తి చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు దక్షిణ భారతదేశంలో రెండు హేచరీ లను మాత్రమే నెలకొల్పడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా లేదు .
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మరో నాలుగు హేచరీలు .....
మోనో డాన్ సీడ్ కోసం అక్కు రైతులు ఎగబడుతుండటాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ కంపెనీ పై వత్తిడి తెచ్చింది .ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వంతో కూడా సంప్రదించారు .తమిళనాడుతో పాటు మన రాష్ట్రంలోకూడా అధిక సంఖ్యలో హేచరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు . తొలుత ఏర్పాటు చేసిన హేచరీలో ఒకటి తమిళనాడులో ని చంగల్ పట్టులో , రెండోది నెల్లూరు జిల్లాలో నెలకొల్పారు .రాష్ట్రంలో అదనంగా నాలుగు హేచరీలు నెలకొల్పే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది .నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న వైష్ణవి హేచరీతో పాటు అదే జిల్లాలో మరో మూడు హేచరీల్లో , ప్రకాశం జిల్లా ఉలవపాడు లోని వైజయంతి హేచరీలో మోనో డాన్ సీడ్ ఉత్పత్తి చేసేందుకు  శ్రీకారం చుట్టారు అందుకు సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖున అనుమతులివ్వగా , ప్రస్తుతం హేచరీల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి .
150 మిలియన్ల సీడ్ కోసం అడ్వాన్సులు ....
గత సెప్టెంబర్ నెలలోనే మోనో డాన్ సీడ్ కోసం రైతులు ఎగబడ్డారు . కానీ , కొత్తగా బ్రూడర్స్ తేవడం , వాటి ద్వారా రెండే హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేయడం వలన ఆలస్యమైంది .మన జిల్లాలోని ఒకరిద్దరు రైతులకు ఆత్రమే మోనో డాన్ సీడ్ దొరికింది .అన్ని హేచరీలకు కలిపి దాదాపు 150 మిలియన్ల సీడ్ కోసం రైతులు అడ్వాన్సులు చెల్లించారు . అంటే .. ఒక్కో రొయ్య పిల్లలకు ఒక రూపాయి చొప్పున లెక్కిస్తే మొత్తం అడ్వాన్సులు రూ 15. కోట్లు చెల్లించారని తెలుస్తోంది . ఇంకా అడ్వాన్సులు కడతామని ఆంధ్రా,  తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆక్వా రైతులు డబ్బులు తీసుకుని తిరుగుతుండగా , అంట సీడ్ ఉప్పత్తి చేయడం తమ వాళ్ళ కాదని హేచరీల నిర్వాహకులు చేతులెత్తేశారు .
source : sakshi
  

Languages

Shares

Related News