ఆక్వా రైతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మత్స్య పశుసంవర్ధక శాఖ మోపి దేవి వెంకట రమణ తెలిపారు కరోనా నివారణపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు . శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ లోఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు . రైతులు అభద్రతా భావంతో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు . ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులపై ధరలను నిర్ణయించిందన్నారు . ప్రాసెసింగ్ యూనిట్లలో వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారు . రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు .
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్ధ కుదేలైంది
వ్యవసాయ , వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైస్ జగన్ చర్యలు తీసుకున్నారు . రైతులు పండించిన పంటలు , ఆక్వా రంగ ఉత్పత్తులకు నషం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . రైతులు ఎవరు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు . అమెరికా వంటి దేశాలు కరోనా వైరస్ వలన కుదేలైపోయాయి . కరోనా వలన గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులు కొంత గ్యాప్ వఛ్చిన మాట వాస్తవమే . అటువంటి గ్యాప్ లేకుండా , రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు .గిట్టుబాటు ధారాలపైనా ఎంపెడా కంపెనీ ప్రతినిధులు తో సీఎం సంప్రదింపులు జరిపారు అని మోపి దేవి తెలిపారు .
ఆ రంగానికి మంచి భవిష్యత్
ఎగుమతులపై చైనా ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తుంది . 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశాము సోమవారం నుంచి ఫిల్డ్ కు వెళ్లి ఎక్స్ పోర్ట్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తాము . ఆక్వా ఉత్పతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది . ధరలు తగ్గిస్తే లైసెన్న్ రద్దు చేస్తాము . మిడిల్ మ్యాన్ వ్యవస్ద చాలా ప్రమాదకరమైనది . దళారి వ్యవస్ధ లేకుండా చేస్తున్నాము . ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంది రైతుల్లో అభద్రతా భావం వద్దు పాజిటివ్ కేసులు పెరగటం వలెనే నిత్యావసర కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా తగ్గితే సమయంలో సడలింపు ఇస్తాము . గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతుంది . అంటూ మంత్రి మోపి దేవి వెంకటరమణ వివరించారు .
Source : sakshi