విశాఖ: మూడు రోజుల పాటు జరగనున్న 20వ భారత అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం విశాఖలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సుందరమైన విశాఖ నగరంలో ప్రదర్శన జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘‘విశాఖలో అన్నీ సుందరమైనవే.. కొండలు, లోయలు, ప్రజలు కూడా మంచివారు. సముద్ర, ఆక్వా ఉత్పత్తుల వ్యాపారం మరింత వృద్ధి చెందాలి. ప్రస్తుతం ఏపీ నుంచి 2.35 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతి జరుగుతోంది. ఒక్క ఏపీ నుంచే 70శాతం ఎగుమతులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఆక్వా ఉత్పత్తుల అభివృద్ధికి రాయితీలు ఇస్తున్నాం’’. అని వివరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. Source : Eanadu