మనం ఆహారంగా తీసుకునే రొయ్య జీవిత చరిత్ర మొత్తాన్ని చెప్పే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. విత్తన దశ నుంచి పట్టుకునే వరకు ముత్తం వివరాలతో పాటు అది ఆరోగ్యకరమైనదేనా? కాదా?అనే అంశాలను ధ్రువీకరణలతో సహా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా రొయ్యల చెరువులతో పాటు హేచరీలు , దాణా ఉత్పత్తి కేంద్రాలు , శుద్ధి ప్లాంట్లను జియోట్యాగింగ్ చేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీగా పిలిచే ఈ విధానంలో వినియోగదారుకు చేరే దాకా ఎక్కడ చిన్నతేడా చిన్నతేడా కన్పించినా దానికి కారణమేంటనేది గుర్తించే వీలుంటుంది. త్వరలోనేకూరగాయలు, పండ్లు ఉత్పత్తుల్లోనూ ఇదే తరహా విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.
ఎందుకీ విధానం ?
మన దేశం నుంచి అమెరికా, ఐరోపాతో పాటూ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న రొయ్యల్లో నిషేధిత యాంటిబయోటిక్స్ అవశేషాలు గుర్తించినప్పుడు ఆ ఉత్పత్తులతో కూడిన కంటెయినర్లను వెనక్కు పంపుతున్నారు. వాటీని శుద్ధి చేసిఎగుమతి చేసిన వారి పైనా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎగుమతులపై ప్రభావంచూపిస్తోంది. రొయ్యల ఉత్పత్తిలో అగ్రభాగాన ఉండే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయే పరిస్ధితి తలెత్తింది. యూరోపియన్ యూనియన్ మన దేశంలో 15 ప్రాసెసింగ్ ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టింది. దీంతో మిగిలినవాళ్లు భయపడుతున్నారు. ఇలాంటి ఉత్పత్తులు ఎక్కడ తయారవుతున్నాయనేది. గుర్తించడంకష్టంగా మారింది. పదుల సంఖ్యలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి తర్వాత ఎగుమతి చేస్తుండటంతో కచ్చితంగా ఎవరి వద్ద తయారైందో చెప్పలేని పరిస్ధితి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే విధానం అందుబాటులోకి తేవాలని ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకూడా వచ్చేఏడాదినుంచి సింప అమలు చేస్తోంది. వీటన్నింటి నేపధ్యంలో నిషేధిత యాంటీబయోటిక్స్ ఉండే రొయ్యలు ఎక్కడ తయారవుతున్నాయో గుర్తించేందుకు ఎంపెడా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకే హేచరీ నుంచి ప్రాసెసింగ్ ప్లాంటు దాకా మొత్తం ప్రక్రియను ఈ విధానంలోకి తెస్తున్నారు.
రెండేళ్లుగా పరిశీలిస్తే విదేశాల నుంచివెనక్కువచ్చిన ఉత్పత్తులో ఆంధ్రప్రదేశ్ కు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. అలాగని రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నవన్నీ ఆంధ్రప్రదేశ్ లో పండించిన రొయ్య పంటే అనుకుంటే పొరపాటేఅనేదిరైతులు , అధికారుల వాదన .విశాఖ కేద్రంగా ఉన్న ప్లాంట్లకు ఒడిశా నుంచి రొయ్యలు వస్తుంటాయి.నెల్లురూ కేంద్రంగాఉండే ప్లాంట్లకుతమిళనాడు నుంచి సరకు వస్తుంది. అక్కడి నుంచి వచ్చే వాటిలో కూడా నిసఃఏధితమందులు అవశేషాలు ఉండొచ్చు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతిఅవుతుండటంతో ఇక్కడి లెక్కలోకే వస్తున్నాయని వివరిస్తున్నారు.
Source : eenadu