ఒంగోలు :
జిల్లాల్లోని రొయ్య రైతుల సమావేశాన్ని ఈ నెల 28 వ తేదీ ఉదయం 10 గంటలకు స్ధానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించనున్నట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రొయ్యల ధరలు బాగా పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రతి కౌంటు కు రూ. 50 నుంచి రూ.80 తగ్గినట్లు తెలిపారు. తగ్గిన ధరల వల్ల రొయ్యల మేతకు పెట్టిన ఖర్చులు కూడా వచ్చే పరిస్ధితి లేదన్నారు. ఈ పరిస్ధితులలో రొయ్యల ధరల పతనం , నకిలీ మందులు సరఫరా అవుతున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకుఈ సమావేశంఏర్పాటూ చేసినట్లు తెలిపారు . అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. రొయ్య రైతులందరూ సకాలంలో సమావేశానికి హాజరుకావాలని కోరారు.
Source : sakshi