జిల్లాలో ఆక్వా ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు . కోస్తా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి బుధవారం నిర్వహించిన వీడియో సమావేశానికి హాజరైన అనంతరం కలెక్టర్ మత్స్యశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు . జిల్లాలో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు . అమ్మకాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు . జిల్లాలో ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏడుఉండగా వాటిల్లో నాలుగు పని చేస్తున్నాయాన్నారు . మిగిలిన యూనిట్లను కూడా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు . ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ప్రదర్శించాలన్నారు. ధరల విషయంలో ఏవైనా ఫిర్యాదులుంటే సంబంధిత మత్స్యశాఖ అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందాలని ఆక్వా రైతులకు సూచించారు .
ఫిర్యాదులు స్వీకరించే అధికారులు
టి. పూర్ణయ్య , ఏడీ, మచిలిపట్నం . - 9985447405
పి . సురేష్ , ఏడీ,అవనిగడ్డ - 9440341243
సీ హెచ్ చక్రాణీ , ఏడీ, విజయవాడ - 9848945191
కె . నాగలింగాచారి , ఏడీ, గుడివాడ - 9440814733
డీఎస్ సుధాకర్ , ఏడీ,కైకలూరు . - 9849042124
సీహెచ్ నాగబాబు , ఏడీ, బంటుమిల్లి . – 7702703462
Source : eenadu