ఒంగోలు:
జిల్లాకు చెందిన రొయ్య రైతులు ధరాఘాతానికి గురయ్యారు.ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతులు తగ్గుపోవడం , రైతులంతా అమెరికా వైపు ,మొగ్గుచూపడంతో ధరలు పడిపోయాయి. రోజు రోజుకూ రొయ్య ధరలు దిగజారిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మున్ముందు ధరలు ఏవిధంగా ఉంటాయో తెలియక కలవరపడుతున్నారు. జిల్లాలోని తీర ప్రాంత మండల్లాల్లో దాదాపు 8 వేల హెక్టార్లలో రొయ్యలు చెరువులు ఉన్నాయి. 3500 మందికి పైగా రైతులు రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నారు.
యూరోపియన్ నుంచి యూ టర్న్:
భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు వెళ్తంటాయి. యూరప్ లోని పది దేశాలకు ఇక్కడి రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీబయోటిక్స్ వాడటంతో యూరొపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ప్రతి రెండు కంటైనర్ల ఎగుమతుల్లో ఒక దానికి శాంపిల్స్ తీస్తున్నారు. నిషేధిత యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసుకునే లైసెన్స్ ను సంబంధిత రైతులు కోల్పోతున్నారు. తిరిగి లైసెన్స్ పొందాలంటే ఆ రైతుకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికాకు ఎగుమతి చేసే రొయ్య ఉత్పత్తుల్లో శాంపిల్స్ తక్కువగా చేస్తుండటంతో భారతదేశానికి చెందీన రైతులు ఎక్కువగా ఆ దేశానికిఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరిక్కాకు పది కంటైనర్లు ఎగుమతికి పెడితే వాటిలో కేవలం రెండు కంటైనర్ల శాంపిల్స్ చూస్తున్నారు. మిగిలిన ఎనిమిది కంటైనర్లను యధాలాపంగా ఎగుమతిచేసుకుంటున్నారు. దీంతో రైతులు కూడా అమెరికాకు ఎగుమతులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో రెండు క్రాప్ లో 24 వేల టన్నులు , రెండవక్రాపెలో 12 వేల టన్నుల రొయ్య దిగుబడులు వస్తున్నాయి. అంటే ఏడాదికిరెండు క్రాప్లకింద36 వేల టన్నులరొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటీలో 90 శాతం రొయ్యలనువిదేశాలకుఎగుమతి చేస్తున్నారు..
స్టోరేజీ సౌకర్యం లేక ధరలనుతెగ్గోసుకుంటున్నారు :
జిల్లా నుంచి ఏటా 36 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ధరలు ఆశాజనకంగా లేని సమయంల్ వాటిని నిల్వ చేసేందుకు స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.80 వేల పైగా ఖర్చు చేస్తున్న రైతులు చివరికి వాటికి వచ్చే ధరలను చూసే నశ్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్ధితి మమ్రింత దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతుకు ప్రాంతాలను బట్టి కౌలు ధర నిర్ణయించారు.రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు కౌలు ధర ఉంది. అంటే ఆ రైతు కౌలు ధర చెల్లించి , పెట్టుబడి ఖర్చులు తీసివేయగా ఏమైనా మిగిలితే మిగిలినట్లు .. లేకుంటేనష్టాలను మూటగట్టుకోవలసిందే . ఒక్కో చెరువులో లక్ష రొయ్యపిల్లలను వదిలితే ప్రస్తుత వాతావరణంలో 60 వేల పిల్లలు కూడా వచ్చే పరిస్ధితులు లేవు. ఒక వైపు దిగుబడి పడిపోయి. , ఇంకోవైపు ధరలు పతనం కావడంతో రొయ్య రైతుల పరిస్ధితిముందు నుయ్యి ,వనుక గోయ్యిగా మారింది.జిల్లాకు సమ్మ్భంధించిన ఆర్ధికాభివృద్ధి రేటులో రొయ్య ఎగుమతుల పాత్ర ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రొయ్య రైతుకుగిట్టుబాటు ధర వచ్చే వరకు వాటిని నిల్వ చేసుకోనేలా ప్రభుత్వం స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే కొంతమేర గట్టెక్కే అవకాశం ఉంటుంది. లేకుంటే రొయ్య రంగం తీవ్ర సంక్షోభంలోకి కిక్కుకొని చివరకు కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
Source : Sakshi