ఆక్వా రంగంలో ప్రగతి పధాన దూసుకెళ్తున్న ఆంద్రప్రదేశ్ ఇందులో కొత్త అవకాశాలు సృష్టిస్తోంది.ఈ రంగంలో నిపుణులు కొరత తీర్చడానికి , పరిశోధనలకు దోహదం చేసేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రవైట్ భాగస్వామ్యంలో ఆక్వావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలాల్లో మొత్తం 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే కమీటిని నియమించి ప్రాధమిక పరీశీలన కూడా పూర్తిచేశారు.ఈ నెల 3న జరగనున్న మంత్రివర్గ సమావేశంలోవిశ్వవిద్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన..
ఆక్వావిశ్వవిద్యాలయం ఏర్పాటుతో ఈ రంగంలో పరిశోధనలు ఊపందుకొని.. చేపలు , రొయ్యల సాగులో రైతులకు ఎదరవుతున్న ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం అధికారుల్లోవ్యక్తమవుతోంది. కోర్సుల బోధనకు ఆస్టేలియా, ధాయ్ లాండ్ , చైనా,వియత్నాం, యూకే తదితర 10 దేశాలౌ చెందిన వర్సటీలతోఒప్పందం చేసుకుంటున్నారు. మొదటి రెండేళ్ళు ఇక్కడ , తర్వాత రెండేళ్ళూ విదేశాల్లో విద్యాబోధన సాగే విధంగా కోర్సులు రూపకల్పన చేస్తున్నారు. ఒప్పందంలో భాగంగా పరిశోధన , అభివృద్ధి విభాగంలో విదేశీ విద్యార్ధులకు కూడాఇక్కడ అవకాశాలు కల్పించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఈఏడాదే తరగతులు ప్రారంభించేందుకు విశ్వవిధ్యాలయం యాజమాన్యంసన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాలను తీసుకుని వచ్చే ఏడాది శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి చేసే దిశగా ఆలోచిస్తున్నారు.
Source: eenadu