తెల్ల మచ్చవ్యాధి
వ్యాధి లక్షణాలు:
సాగు రొయ్యలకు తెల్ల మచ్చవ్యాధి సోకినప్పుడు ఈ క్రింది సూచించిన లక్షణాలను గమనించవచ్చును. కొన్ని సమయాలలో ఈ వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకపోయినా ఈవ్యాధి ఆ
రొయ్యలలో నిగూఢంగా ఉండవచ్చు.
సాగు సమయంలో వ్యాధి సంకేతాలు:
•అధిక సంఖ్యలో రొయ్యపిల్లలు చనిపోవడం.
•పెంపకపు సమయంలో ఏదశలోనైనా ఈ వ్యాధి సోకవచ్చు.
సాగు చెరువులో గుర్తించిన లక్షణాలు :
•కొన్ని సమయాలలో రొయ్యలు వ్యాధి సోకినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు బహిర్గతం చేయకపోవచ్చు.
•రొయ్యలు కదలిక తగ్గించి ఒకే ప్రదేశంలో ఉండుట .చాలా బలహీనంగా వుండుట.
•తెల్ల మచ్చవ్యాధి సోకిన రొయ్యలు మేతలను తీసుకొనుట నిలిపి వేస్తాయి.
•కొన్ని రోజుల తరువాత చనిపోవడానికి సిద్దంగా వున్న రొయ్యలు నీటిపై తేలూతూ, చెరువు అంచుల వద్ద ఉండుట గమనించవచ్చు.
వ్యాధి సోకిన రొయ్యలలో గమనించకలిగిన లక్షణాలు:
•రొయ్యల యొక్క షెల్ పై 0.5-2.0 మి.మీ.వ్యాసము కలిగిన గుండ్రని మచ్చలను గమనించవచ్చు. ఈ మచ్చలు ఏర్పడకపోయినా రొయ్యలలో ఈ వ్యాధి ఉండవచ్చు.
•రొయ్యల శరీరం మరియు అపెండెజిస్ ఎర్ర రంగు లేక పింక్ రంగులోకి మారతాయి.
•బాహ్య పరాన్న జీవులు సోకటం వలన రొయ్యకు శరీర భాగం ఎక్కువ మరియు రొయ్య మొప్పలపై బూజు పట్టినట్లుగా ఉంటాయి.
•ఎక్కువగా వ్యాధి సోకిన రొయ్యలలో ఆహార నాళం యొక్క మధ్య భాగం తెల్లగా మారవచ్చు.
వ్యాధి కారక జీవులు:
•తెల్ల మచ్చవ్యాధిని కలిగించే వైరస్
రొయ్యలలో వ్యాధి సోకే సమయం:
•పెంపకపు సమయంలో ఏ దశలోనైనా వ్యాధి సోకవచ్చు.
•పెంపకపు క్షేత్రాల్లో యస్.పి.యఫ్. మోనోడాన్ మరియు వెన్నామీ కూడా ఈ వ్యాధి బారిన పడవచ్చు.
వ్యాధి క్రిములను అందజేసే జీవులు:
•ఈ వైరస్ ఒక జీవి నుండి వేరొక జీవిలో వ్యాధిని కల్గిస్తుంది.
ప్రకృతిలో ఈ వ్యాధిని ఎక్కువ చేసే జీవులు:
•ప్రకృతి వనరులలో నివసించే డెకపోడ్ జాతికి చెందిన జీవులు వైరస్ కి లోనై, అనుకూలమయిన వాతావరణ వున్నప్పుడు వ్యాధికి లోనవుతాయి.
•ఇతర జాతులకు చెందిన డెకాపోడ్ క్రష్టేయన్స్, రోటిఫెర్స్, ఆర్టీమియా జాతుల జీవులు,తమకు ఈ వ్యాధికలుగకుండా , ఈవైరస్ ను ఇతర జీవులకు సంక్రమింపచేస్తాయి.
•ములస్కా జాతి జీవులు, పాలీఖీట్ జాతి పురుగులు క్రష్టేషియన్స్ జాతికి చెందని నీటిలోని ఆర్దోపోడ్ జీవులు లార్వాలు ఈ వైరస్ని ఇతర జీవులకు సంక్రమింపచేస్తాయి.
వైరస్ని ట్రాన్స్ మిట్ జరిపే పద్ధతి:
•వైరస్ని ట్రాన్స్ మిషన్ రెండు పద్ధతులలో జరుగుతుంది .
•హారిజాంటల్ పద్ధతి : ఈ పద్ధతిలో వ్యాధికి లోనైన రొయ్యలు ఆరోగ్యంగా వున్న రొయ్యలకు ఆహారం ద్వారా మరియు నీటి ద్వారా వ్యాధి కారక వైరస్ ను అందజేస్తాయి.
•వర్టికల్ పద్ధతి: వ్యాధి సోకిన రొయ్య పిల్లలు పెట్టేటప్పుడు వాటి పిల్లలకు లార్వాలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి సోకిన చెరువుల యాజమాన్యం:
•బయో సెక్యూరిటీ పద్ధతులలో పద్ధతులలో వుపయోగించుట , సాగు చెరువులపై ఎగిరే పక్షులను వలల వాడకం ద్వారా నియంత్రించట, పీతలను సాగు నీటిలోని ప్రవేశించకుండా
నియంత్రణ , రైతులు చేతులను సాగు నీటిలో కడుగరాదు.
•కాళ్ళను శుభ్రంగా వుంచుకోవాలి.సాగు చెరువులలో మేతను అందజేసే పద్ధతిలో వుపయోగించే ట్రేలను శుభ్రంగా వుంచాలి.
•నమ్మకమైన సంస్ధ నుండి ఎస్ పిఎఫ్ రొయ్య పిల్లలను సేకరించాలి. పిసిఆర్ పరీక్షలు నిర్వహణ ద్వారా ఆరోగ్యవంతమైన వ్యాధి గుర్తించి వ్యాధి లేని పిల్లలను మాత్రమే పెంపకం కొరకు
తీసుకోవాలి.
•సూచించిన మంచి ఆక్వా సాగు యాజమాన్య పద్ధతులను పాటించాలి.
•రొయ్యపిల్లల స్టాకింగ్ చలికాలంలో వాతావరణ ఉష్టోగ్రతలు తక్కువగా వున్నప్పుడు చేపట్టరాదు.
•పెంపకానికి బయోసెక్యూర్ జరిపిన నీటిని ఉపయోగించాలి.
•రొయ్య పిల్లలను మరియు చేప పిల్లలను సాగుకు మంచి యాజమాన్య పద్ధతులను ఎంచుకుని ఉపయోగించాలి.