For Advertisement Enquiries Please Contact +91 7901268899

కొరకరాని రొయ్య

img

రెండెకెల వృద్దిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాసాగును ప్రోత్సహిసున్నా మూడేళ్లలోనే రాష్ట్రం నుంచి ఎక్కువ శాతం రొయ్య ఇతర దేశాలకు ఎగుమతి  అవుతున్నాయి.తద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తంది.కానీ ఇటీ వల రొయ్యల్లోమనిషి ఆరోగ్యానికి హాని చేసే అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. గత 20 నెలల్లో భారత్ కు 48 రొయ్యల కంటైనర్లు తిరిగి వచ్చాయి.అందులో మన జిల్లా నుంచి ఎగుమతి చేసినరొయ్యలు ఉన్న్ట్లు మత్స్య శాఖ అధికారులు గుర్తించారు. వెనక్కి వచ్చిన రొయ్య పరిమాణాన్ని బట్టీ జిల్లా పంట ఉత్పత్తి సైతం రెండు నుంచి మూడు కంటైనర్లు సరకు ఉంటుందని భావిస్తున్నారు. దీనిని బట్టే జిల్లాలో సాగు చేస్తున్న  రొయ్య పంట ఉత్పత్తిలో  యాంటీ బయోటిక్స్ ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నట్లు  నిర్ధరించారు.
ఇదే పరిస్ధితి కొనసాగితేరొయ్య ఎగుజ్మతులుతగ్గడం ద్వారా రైతు నష్టపోవడంతో పాటుప్రభుత్వానికి ఆదాయ వనరులూ తగ్గేఅవకాశం ఉంది. అందుకే యాంటీ బయోటిక్స్ వాడకం నియంత్రణపై అప్రమత్తమైన జిల్ల మత్య్స శాఖ అధికారులు క్షేత్రస్ధాయిలో  రైతులకు అవ్గాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పెరగనున్న వెనామీ సాగు
జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన , ఒంగొలు , కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ , ఉలవపాడు , గుడ్లూరు, చినగంజాం , నాగలుప్పలపాడూ , వేటపాలెం , చీరాల ప్రాంతాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా , గత అయిదేళ్లుగా వెనామీ  సాగు ద్వారా రైతులు అధిక దిగుబడీ తీస్తున్నారు. ధరలు సైతం ఆశాజనకంతో ఉండటంతో ఆర్ధికంగానూ స్దిరపడ్డారు.దీంతో మరికొందరు. రైతులుసైతం వెనామీ సాగుపై ఆసక్తి చూపడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది అధికారిక, అనధికారిక సాగు కలిపి మొత్తం పదివేల హెక్టార్లల్లో రొయ్య సాగు చేశారు. రానున్న సీజన్ కు సాగు పెరగనుందని, సుమారు 14 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నన్నారు. జిల్లాలో వస్తున్న  ఉత్పత్తి ప్రధానంగా చైన్నై  ప్రాంతానికి వెళుతుండగా అక్కడి నుంచి అమొరికా ,జపాన్, మొక్సికో, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
మేతలోనూ రసాయనలు...
 ఆక్వా రంగంలో మందుల వినియోగం పెరిగింది. ప్రధానంగా జిల్లాలోని ,టంగుటూరు, సింగరాయకొండ ,చీరాల ప్రాంతాల్లో సుమారు 36 ఆక్వా మందుల దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ కంపెనీలు రొయ్యల మేతలోనూ విచ్చలవిడిగా రసాయనాలు కలుపుతున్నట్లు సమాచారం . గత రెండేళ్లుగా వాతావరణ మార్పులను దృష్టిలో  పెట్టుకుని , రొయ్య జబ్బుకు గురికాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్స్ వాడకంఅధిక మోతాదులో ఉంది. అది రొయ్యలోనేనిక్షిప్తమై ఉంటుంది. దానిని మనం ఆహారంగా తీసుకుంటే .. రొయ్యలోని యాంటీ బయోటిక్స్  అవశేషాలు శరీరంలోకి చేరతాయి. అదేజరిగితే మనిషి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. పైగా ఏటా  వచ్చే దిగుబడుల్లో అధికశాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది.గత రెండేళ్లుగా వాతావరణ పరిస్ధితులు అనుకూలించకపోవడంతో రొయ్య కౌంటు 80 ఉన్నపుడే చెరువులో పంట తీస్తున్నారు. 30 నుంచి 50 మధ్య కౌంటు ఉన్న రొయ్యను కొనుగోలు చేసేందుకు ఎగుమతిదరులు ఆసక్తి చూపుతున్నారు. దాంతో రొయ్య ఎదుగుదలకు రావడంతో పాటు వ్యాధుల బారిన  పడకుండా ఉండేందుకు రైతులు రసాయనాలు వాడుతున్నారు.
రైతులకు అవగాహన సదస్సులు
మన జిల్లాలో ఉత్ప్త్తి అవుతున్న రొయ్యల్లోనూ నిషేధిత యాంటీ బయోటిక్స్ అవశేషాలు  ఉన్నట్లు గుర్తించిన మత్స్యశాఖఅధికారులు – పరిస్ధితిని చక్కద్దిద్దేంకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.. యాంటీ బయోటిక్స్ వినియోగం  , తద్వారా రైతులకు వచ్చే నష్టలను నియంత్రించేందుకు మత్స్యశాఖ అధికారులు అవగాహన సదస్సు లకు తెరదీశారు. రొయ్యలసాగులో ఎలాంటి మందులు వినియోగించాలి. ఎలాంటి మందులు వాడకూడదనేఅంశాలను వివరిస్తున్నారు. మరోపక్క జిల్లాలో దుకాణాలు పరిశీలించి, ఎలాంటి మందులు అమ్ముతున్నరనే విషయాన్ని అధికారులు సేకరిస్తున్నారు. నిషేధిత మందుల నియంత్రణ కోసం డీవిజన్ స్ధాయి టాస్క్ ఫీర్స్ బృందాలను ఏర్పాటుచేసేందుకు అధికారులు ప్రణాళిక చేశారు.s
Source : eenadu
 

Languages

Shares

Related News