అమరావతి : ఆంధ్రప్రదేశ్ చేపల మేత బిల్లు -2020 , ఏపీ చేప పిల్లల పెంపకం సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లు - 2020 లకు అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది . ఈ మూడు బిల్లులను పశు సంవర్ధక , మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం సభలో ప్రవేశ పెట్టడం తెలిసిందే . వీటిపై మంగళవారం వేర్వేరుగా చర్చ జరిగింది . ఈ సందర్బంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు వైస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆక్వా రైతులు ఆయన్ని కలిసి గోడు చెప్పుకున్నారని గుర్తు చేశారు .ఆ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఆక్వా రంగానికి విధ్యుత్ సబ్సిడీ , నాణ్యమైన సీడ్ ఎగుమతులకు అవకాశం , మద్దతు ధర కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు .ఫిషరీస్ వర్సిటీ ఏర్పాటు బిల్లుపై చర్చ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ .. ఫిషరీస్ /ఆక్వా రంగాల్లో నిపుణుల తయారీ ద్వారా మానవ వనరుల కొరతను తీర్చాలనే ముందుచూపుతో పశ్చిమ గోదావరి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు సీఎం నిర్ణయం తీసుకున్నారు . ఈ రంగంలో ఉన్న విద్య , పరిశోధన సంస్ధలను యూనివర్సిటీ పరిధిలోకి చేర్చుతాం అని చెప్పారు
source : sakshi