For Advertisement Enquiries Please Contact +91 7901268899

డంగవుతున్న డాలర్ల పంట

img

డాలర్ల పంట రొయ్యల సాగుకు ప్రమాదం పొంచి ఉందని , ఆ రంగంలో నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ్నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో మందుల అవశేషాలు బయటపడటమే దీనికి కారణంగా తెలుస్తోది. యూరోపియన్ యూనియన్ మన దేశ రొయ్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ కంటైనర్లను మందుల అవశేషాలు ఉన్నాయంటూ తాజాగా నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆక్వా రంగం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు ఇదే కారణంతో విదేశాలు మనరొయ్యలను దిగుమతి చేసుకోపోవడంతో ఆక్వా రంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది.
క్షణం ... క్షణం గండం:  

మనకు అమిరికా  తర్వాత అతి పెద్ద మార్కెట్యూరప్. కానీ దిగుమతి విషయంలో  అక్కడ నిభందనలు ఇపుడు మరింత కటినంగా మారాయి . ఇప్పుడు ప్రతి కంటైనర్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మందుల అవశేషాలు లేవని తేలితేనే దిగుమతికి అంగీకరిస్తున్నారు. లేదంటే నిర్ధాక్షిణ్యంగా కంటైనర్లను వెనక్కి పంపేస్తున్నారు. గత నెల మొత్తం 15 కంటైనర్ల  వెనక్కి వచ్చినట్లు తెలుస్తోది. ఇప్పుడు తాజాగా మరో రెండు కంటైనర్లను వెనక్కి పంపివేయడంతో పరిస్ధితి క్లిష్టంగా మారిపోయింది .మన దేశ రియ్యలను దిగుమతి చేసుకోకుండా నిషేదం విధించే దిశగా  అక్కడ ఏర్పాట్లుజరుగుతున్నట్లు తెలుస్తోది. ఒకప్పుడు యూరప్ లో మన రొయ్యలకు 50 శాతం వరకు మార్కెట్ ఉండేది . వివిధ కారణాలతోఅది ప్రస్తుతం 30 శాతానికి  పడిపోయింది. నిషేధం విధించడం జరిగితేఇక పూర్తిగా గడ్డుకాలం తప్పడు .అమెరికా  మార్కెట్ లో మన ఎగుమతులు శాతం  ప్రస్తుత్తం 60 శాతంగా ఉంది. యూరప్ మార్కెట్ నిషేధం విధిస్తే అమెరికాలో కూడాపరిస్ధితి మారిపోతుంది.

ఏమీటీ  మందుల అవశేషాలు:
రొయ్యలకు వ్యాధులు రాకుండా , వచ్చిన వ్యధులు వ్యాప్తి చెందకుండా మందుల అవశేషాలను రొయ్య సాగులో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సీడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందనే కారణంతో ఆ దశలోనే అతి కొద్ది మోతాదులో యాంటీబయోటిక్స్ ను వాడుతున్నారు. తర్వాత రైతులు ఇష్టానుసారంగా  సాగులో వాటిని వినియోగిస్తున్నారు. దీంతో మొత్తం ఆక్వా రంగానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

దృష్టి సారించాలి:
అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్ధిలపై ఆక్వా రంగంలోని ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. గడిచిన కొన్నేళ్లుగా కంటైనర్ల వెనక్కి రావడం పెరుగుతూ వస్తుంది.  అ పరిస్ధితి అలాగే కొనసాగితేనిషేధించే అవకాశం  ఉంటుంది. కాబట్టి యాంటీబయోటిక్స్ విషంలో అందరూ జాగ్రత్త పడాలి.గతంలో ఒక కంటైనర్ల  కొద్ది రొయ్యలను మాత్రమే  పరీక్షించేవారు. ఒకప్పుడు ఒక కంటైనర్ లో 50 శాతం రొయ్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Source : eenadu

 

Languages

Shares

Related News