తెల్ల మచ్చ తో తంటా
ఉమ్మడి జిల్లాలో 1 .10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రైతులంతా వేసవి పంటపై ఆశలు పెనుముకుని సాగుకు సిద్ధమవుతున్న వేళ తెల్లమచ్చల వ్యాధితో ఒక్కసారిగా ఆందోళన మొదలైనది .ఏలూరు రురల్ , ఆకివీడు , కైకలూరు , కృష్ణ జిల్లాలోని గుడివాడ,నందివాడ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది .
మండవల్లి , న్యూస్ టుడే : వేసవి వచ్చినా వైట్ స్పాట్ వ్యాధి రొయ్యల రైతులను కనికరించడం లేదు . డాల్లర్ల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగులో రైతులకు మాత్రం మంచి రోజులు రావడం లేదు . ఒక పక్క చెరువులను సిద్ధం చేస్తుంటే మరో పక్క వ్యాధి తరుముకొస్తుంటే చెరువులు ఖాళీ అవుతున్నాయి .అప్పులు తెచ్చి రూ . లక్షల్లో పెట్టుబడులు పెట్టి రొయ్యలరైతులు ఏమి చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.సీడ్ లో నాణ్యత లేకపోవడమే వ్యాధి సోకడానికి ప్రధాన కారణమని రైతులు గగ్గోలు పెడుతున్నారు .
విత్తన నాణ్యత , నిర్వహణ లోపం ..ఒక చెరువులో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పెట్టుబడి చేసి .. వ్యాధి ఇతర చెరువులు వ్యాపించకుండా మందులను పిచికారి చేసుకోవాలి .ఒక ప్రాంతంలో వైరస్ ఉన్నపుడు సాగు చేయకుండా పంట విరామాన్ని ప్రకటించి అంటా ఒకేసారి సాగు ప్రారంభించాలి . మరో వైపు విత్తనం అందించే హేచరీ సైతం నాణ్యత కలిగిన రొయ్య పిల్లలను అందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి .కానీ హేచరీ యజమానులు , రైతులు ఎవరి స్వార్ధం వారు చూసుకుంటూ అంటా నష్టాల బాటలోనే నడుస్తున్నారు .