ఆక్వా రంగం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్ధానంలో వున్నది. వెన్నామి రొయ్యల సాగులో దాదాపు లక్ష టన్నుల ఉత్పత్తి సాధిస్తూ రొయ్యల ఎగుమతుల ద్వార విదేశీ మారకద్రవ్యాన్ని అర్జిస్తున్నది.మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నఉప్పునీటి రొయ్యలలో దాదాపు 90% విదేశాలకు ముఖ్యంగా జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి దారులు లైసెన్సు కలిగివున్న రిజిస్టర్డ్ రైతుల నుండి మాత్రమే సరుకు కొనడం వలన కొన్ని కారణముల వలన లైసెన్సు లేని రైతులు తక్కువ ధరకు రొయ్యలను అమ్ముకొని నష్టపోతున్నారు. భూ సంభంధమైన వివాదములు ఉండి లైసెన్సు లు లేని రైతులు సరుకు అమ్ముకోనడానికి గతంలో MPEDA ఎంపెడా వారికి నెంబర్లు కేటాయించి , తద్వారా వారు సరుకును అమ్ముకొనే సౌకర్యం కల్గించినారు. ఆ విధంగా గతంలో ఎంపెడా వద్ద తమ వివరాలను నమోదు చేయుంచుకున్న రైతులు సుమారు 50% అనగా జిల్లాలో 1500 మంది ఉంటారు. మిగిలిన 2000 మంది రైతులకు కూడా ఆ సదుపాయం కల్పించేందుకు ఎంపెడా మరియు మత్స్యశాఖ సంయుక్తంగా రైతుల వివరాలను సేకరించడానికి సమాయత్తమౌతున్నారు.వారు ప్రధానంగా 5 టీములుగా టంగుటూరు మండలంలో 21-8-2017 నుండి పర్యటించి రొయ్యల చెరువులను పరిశీలించి విషయసేకరణ చేస్తారు. తదనంతరం వారికి ఒక కార్డు అందిస్తారు. కావునా, రైతులు తమ చెరువుల యొక్క పట్టాదారు పాసుపుస్తకంకాపీలు, పాస్ పోర్టు సైజు పోటో, ఏదైనాఒక ఫోటో గుర్తింపు కార్డు సర్వే టీములకు అందించి లబ్దిపొందగలరని ఎంపెడా, మత్స్యశాఖ వారు విజ్ఞప్తి చేయుచున్నారు.