నెగ్గిన 'ట్రంప్ 'రితనం
కలిదిండి, న్యూస్టుడే: "నష్టం వాటిల్లిన ప్రతిసారి వచ్చే పంట బాగుంటుందన్న ఆశతో ఉన్నా.. అమెరికా సుంకాల నేపథ్యంలో సాగు చేయాలంటే వెన్నులో వణుకు పుడుతోంది' అని కొండంగికి చెందిన ఓ రొయ్యల రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీ ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తెంపరితనాన్ని నెగ్గించుకున్నారు. భారత్ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి. రొయ్యల ఎగుమతులు, ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఏప్రిల్ నుంచి కష్టాలు.. ఏప్రిల్లో ట్రంప్ తొలిసారి సుంకాలపై చేసిన ప్రకటనతో ఉమ్మడి పశ్చిమలోని ఆక్వా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క రోజులో 100 కౌంటు కిలో ధర రూ.260 నుంచి రూ.210కి పడిపోయింది. సుంకాల అమలు వాయిదా వేసినా ధర వేగంగా
పెరగలేదు. ఆగస్టు 20 నాటికి రూ.255కి చేరింది. అంటే దాదాపు పాత ధరలు రావడానికి మూడు నెలలు పట్టింది. ఏడు నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయనే తాజా ప్రకటనతో కిలో రొయ్యల ధర రూ.40 వరకు పడిపోయింది.
మినహాయింపు కోరతాం.. సుంకాల నుంచి రొయ్య ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వకపోతే ఆక్వా రంగానికి మనుగడ ఉండదు. దీనిపై ఆక్వా రైతుల సంఘాల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిస్థితి వివరిస్తామని ఉమ్మడి జిల్లాల రొయ్యల రైతు సంఘం అధ్యక్షుడు నంబూరి గజపతిరాజు స్పష్టం చేశారు.