టంగుటూరు : తీర ప్రాంత మండలాల్లోని ఆక్వా చెరువులు , ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులు రాష్ట్ర ఆక్వా కల్చర్ అధారిటీ చట్టం 2020 ప్రకారం జిల్లా మత్స్యశాఖ నుంచి తగిన అనుమతులు పొందాలని మత్స్య శాఖ జేడీ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి సూచించారు .బుధవారం టంగుటూరు మండలంలోని అనంతవరం , తేటుపురం , పసుకుదురు గ్రామాల్లో అస్సైడ్ భూముల్లో అధికంగా ఆక్వా సాగు జరుగుతోంది .అలాంటి వారి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు .ఇది వరకే కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ అనుమతి తీసుకున్న వారు ఇప్పుడు అప్పుడా కింద ఎండార్స్మెంట్ తీసుకోవాలన్నారు సీఏఏ లైసెన్సు లేని రైతులు కొత్త వాటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు .అద్దంకి , దర్శి , ముండ్లమూరు , బల్లికురవ , కురిచేడు , సంతమాగులూరు మండలాల్లో మంచినీటి చేపల సాగు చేస్తున్న రైతులు సైతం అప్సడా అనుమతులు తీసుకోవాళ్లన్నారు .ఈ మేరకు సచివాలయంలో జనవరి 31 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .ఆయన వెంట టంగుటూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఇ .రవికుమార్ , వీ ఎఫ్ఏ లు పాల్గొన్నారు .
source: eenadu