కాకినాడ : రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఆక్వా హబ్ లకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఎండు చేపలను పంపేందుకు చర్యలు తీసుకుంటామని , తద్వారా ఇక్కడి మత్స్యకారులకు లబ్ది కలుగుతుందని రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు .మంత్రి కురసాల కన్నబాబు , ఎంపీ వంగా గీత , మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆమె గురువారం కాకినాడ ఫిషింగ్ హార్బర్ , జెట్టలను పరీశిలించారు . ఈ సందర్బంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ కాకినాడ తీరంలో లభ్యమయ్యే ట్యూనా చేపల ప్రాసెసింగ్ కు మత్స్యకార భాగస్వామ్యంతో యూనిట్లను అందుబాటులోకి తెస్తామన్నారు .రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్ లకు ఎండుచేపలను కాకినాడ నుంచి నేరుగా సరఫరా చేయడంతో మత్స్య కారులు లబ్ది పొందవచ్చని చెప్పారు .
source: sakshi