ఆక్వాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఏపీ సెంతర్ ఫర్ ఆవా కల్చర్ పేరుతో ప్రత్యేక సొసైటీని నమోదు చేయించింది. మత్స్యశాఖ ప్రాజెక్టులు, వాటి అమలు , విత్తన ఉత్పత్తి , సాగువిధానాలన్నీ దీని పరిధిలోకే రానున్నాయి. ఆధునిక విధానంలో సాగు , సుస్ధిర సాగు దిశగా ప్రోత్సాహాన్ని ఈ కేంద్రం అందిస్తుంది. ఆక్వా యూనిట్లు ఏర్పాటూ చేయాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు , రైతులకు సలహా, సాంకేతికసేవలను అందిస్తుంది. మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్టా ద్వివేది అధ్యక్షుడిగా వ్యవహరించే దీనికికమిఢనర్రామ శంకర్ నాయక్ సీఈఓగా వ్యవహరిస్తారు. మత్స్య శాఖ కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరరావు కార్యదర్శిగా , మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Source : eenadu