అమెరికా భారత రొయ్య ఎగుమతులపై డంపింగ్ డ్యూటీ తొలగించడంతో భారత సీపుడ్ ఎగుమతులను గణనీయంగా పెంచడానికి చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులను మరింత పెంచాలని నిర్ణయించింది.భారత సముద్ర ఎగుమతి సంస్ధలు 2020 నాటికి $ 10 బిలియన్ ల ఎగుమతులను చేరుకోవాలని గమ్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత్తం ఉన్న $ 4.68 బిలియన్ లకు రెండు రెట్లు అధికం. వీటిలో రొయ్యలదే అధిక భాగం.
బ్లాక్ టైగర్ రొయ్యలు ఎగుమతికి గత సంవత్సరంతో పోల్చుకుంటే పరిమాణంలో 6.56 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తి 71.400 టన్నులు. బ్లాక్ టైగర్ సంయుక్త మరియు ఆగ్నేయ ఆసియాలో డిమాండ్ ఎక్కువ . మరియు వీటి త్వరిత పెరుగుదల మరియు అధిక పరిమాణం ఎగుమతులను పెంచడానికి దోహద పడుతుంది. Brood stock కేంద్రాలను మరిన్ని పెంచడం ద్వారా వీటి ఎగుమతులపై వృద్ధి సాధించాలని MPEDA అనుకుంటుంది. బ్లాక్ టైగర్ రొయ్యలకు సీజన్ నవంబర్ నుండి మే వరకు అనుకూలం.