For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యల పెంపకం ఉపాధికి ఊతం

img

రైతులు కేవలం వ్యవసాయం పైనే కాకుండా , ప్రత్యామ్నయా రంగాల పైనా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రములో మత్య్స సాగుకు ఆదరణ పెరిగింది. నేడు వ్యసాయరంగం కన్నా మత్స్యరంగమే  రైతులకు అధికాదాయాన్ని అందిస్తోంది . ర్రాష్ట స్థూల  ఉత్పత్తి నే ప్రభావితం చేస్తున్న మత్స్యరంగం ఉపాధికి కేంద్ర బిందువుగా మారుతొంది . గుంటూరు జిల్లాల్లోని బాపట్ల , రేపల్లె నియోజకవర్గాల తీఇరా ప్రాంతాల్లో ఆక్వా రంగం కేంద్రీకృతమైనది . ఇక్కడ 8,788  హెక్టార్లలో  రొయ్యల చెరువులుసాగులో ఉన్నాయి. ప్రధానంగా కర్లపాలెం , బాపట్ల , పిట్టలవానిపాలెం , నిజాంపట్నం మండలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తే .. పంట చేతి కొచ్చ్చి , లాభాలు వస్తున్నాయి . ఎకరాల్లో 50 - 70 వేలు రొయ్య పిల్లలను వదిలిన చెరువులో..పంట సక్రమంగా పండితే , 50 కౌంటులో టన్ను దిగుబడి వస్తుంది . ఇందుకు సుమారు రూ. 1 .50 నుంచి రూ. 1 .80 లక్షల వరకు పెట్టుబడి  పెడుతున్నారు గిట్టుబాటు ధర ఉంటే పెట్టుబడి పోను రూ.1 .50 నుంచి రూ.1 .80 లక్షల వరకు లాభాలొస్తున్నాయి అంటే  రూపాయి పెట్టుబడికి ఖర్చులు పోను రూపాయి మిగులుతుంది ఏటా 2 , 3  పంటలు పండిస్తూ 25   వేళా టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. రూ. 625  కోట్ల మేర ఎగుమతులు చేస్తున్నారు. . రొయ్యల ఎగుమతుల్లో కర్లపాలెం పేరుగాంచింది .
ఏడాదికి  2 - 3  పంటలు
రైతులు ఏడాదికి 2 - 3  పంటలు పండిస్తున్నారు . తీఇరా ప్రాంతంలో ఈ పంట సాగుకు అనువైన వాతావారణం ఉంది . అన్ని అనుకూలిస్తే .. 70 -120  రోజుల మధ్య పంట చేతికొస్తోంది . ఎకరాలో సాగుకు 70 - 80 వేళా లోపు రొయ్యపిల్లలు సరిపోతాయని అధికారులు చెబుతుండగా , రైతులు మాత్రం అంతకుమించి పిల్లలను వేస్తున్నారు. చెరువుల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఏరియేటర్లను ఉపయోగిస్తున్నారు. రొయ్యలకు వైట్ గాట్, విబ్రియా ,వైట్ స్పాట్ , ఈ హెచ్ పీ, నెక్రోసిస్  వంటి వైరస్ వ్యాధుల బెడద పెరుగుతోంది .
ఐరోపా దేశాలకు ఎగుమతి
 ప్రస్తుతం తిమిరంలో 85  శాతం వరకు వనామి రకం రొయ్యలను 15  శాతం వరకు టైగర్ రొయ్యలను సాగు చేస్తున్నారు . ఉత్పత్తి  చేసిన రొయ్యలను ప్రాసెసింగ్ చేసి కాకినాడ , కృష్ణ పట్నం పోర్టుల ద్వారా  యూరప్ , అమెరికా , ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు యూరప్ దేశాలకు ౭౦ శాతం రొయ్యలు ఎగుమతవుతున్నాయి . రెండేళ్ల క్రితం  వరకూ ధరలు అనూకూలించడంతో రొయ్యల సాగులో అధిక లాభాలు ఆర్జించారు . కొంత కాలంగా గిట్టుబాటు ధరల్లేకరైతులు నష్ట పోవడంతో , ప్రభుత్వం వారికి ఆసరాగా నిలిచింది . సెరువుల అభివృర్ధికి రాయితీపై రుణాలు , 50  శాతం  రాయితీతో ఏరియేటర్లు , 75  శాతం రాయితీతో  సోలార్ పంపు సెట్లు , లైట్లు అందిస్తోంది . యూనిట్ విద్యుత్తు  ధరను రూ. 3 .86 నుంచి రూ. 2  కు తగ్గించింది . విద్యుత్తు సమస్యను చాలా వరకు పరిష్కరించింది . ప్రస్తుతం ధరలు అనుకూలంగా ఉండటంతో రొయ్యల సాగుకు  రైతులు పెడెత్తున సన్నద్ధమయ్యారు . వేలాది మంది కూలీలకు , హేచరీల కార్మికులకు ఉపాధి లభించనుంది .
  Source : eenadu

 

Languages

Shares

Related News