For Advertisement Enquiries Please Contact +91 7901268899

గిట్టుబాటుధర కల్పించాలని రొయ్య రైతుల ధర్నా

img

ఒంగోలు: రొయ్య రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అంతర్జాతీయంగా విదేశాలకు ఎగుమతి చేసే రొయల ధరలు ఏ మాత్రం తగ్గకపోయినా , ఇక్కడి వ్యాపారులుసిండికేట్ అయి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలుచేస్తున్నారని ఆందోళన వ్యక్టం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ మాట్లాడుతూ జిల్లాలో 27 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తుండగా ఏటా 40 వేల టన్నుల రొయ్యలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు.అయితే ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్గామారిరొయ్యలను రైతుల వద్ద నుంచి ప్రతి కేజికి అంటే కౌంటుకు రూ. 100 నుంచి రూ. 150 వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఫీడ్ ఖర్చులు కూడా రాని పరిస్ధితి నెలకొందని తెలిపారు.ఎకరాకు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి నష్టపోవాల్సివస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.పైగా కోస్టల్ ఆక్వా అధారీటివారి అనుమతి లేకుండా వందల సంఖ్యలో రొయ్యల మందుల తయారీకంపెనీలు నాసిరకం మందులు తయారుచేసి , రైతులకు అమ్ముతున్నా పట్టించుకునే వారు లేరని తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలోని రొయ్యల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోరైతు సంఘంజిల్లా అధ్యక్షుడు మండవ శ్రీనివాసరావు , రైతులునాహేశ్వరరావు,కల్లూరి చంద్రయ్య , ఆర్ సుబ్బారెడ్డి, మారినేని వెంకటేశ్వర్లు , ఆర్. సురేష్ బాబుమార్నేనివెంకటేశ్వర్లు  రైతులు పాల్గొన్నారు.
Source : sakshi
 

Languages

Shares

Related News