For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యపై సుంకాల పిడుగు

img

రొయ్యపై సుంకాల పిడుగు
బాపట్ల, న్యూస్టుడే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మార్కెట్లో వనామీ రొయ్యల ధరలు పతనమయ్యాయి. సుంకాల భారాన్ని మోపడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 21 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఫిబ్రవరితో ప్రారంభమయ్యే సీజన్లో 60 శాతం విస్తీర్ణంలో వనామీ, 40 శాతం విస్తీర్ణంలో టైగర్ రొయ్యలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 50 శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి చేస్తుంటారు. ఏప్రిల్లో తొలిసారి. అమెరికా 26 శాతం సుంకాలు విధించిన సమయంలో మార్కెట్లో రొయ్యల ధరలు కుప్పకూలాయి. వనామీ రకం రొయ్యల వంద కౌంట్ ధర రూ.230 నుంచి రూ. 170కు దిగజారింది. రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస ధర రూ.220 గా నిర్ణయించింది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సుంకాల పెంపును మూడు నెలలు వాయిదా వేశాం.. పది శాతమే వసూలుచేస్తామని ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వనామీ రొయ్యల వంద కౌంట్ ధర తిరిగి రూ.230కు చేరింది. జూన్లో కొత్త పంట రాగా.. ధర రూ.210కు పడిపోయింది. జులై మొదటివారం నుంచి ధర పెరుగుతూ వచ్చి బుధవారం వరకు రూ.260 నుంచి రూ.270 పలికింది.
ట్రంప్ మళ్లీ సుంకాల భారం మోపడంతో 24 గంటల్లో వనామీ వంద కౌంట్ ధర రూ.230కు తగ్గింది. 25 శాతం సుంకంతో పాటు జరిమానా విధించడంతో తమపై కేజీకి రూ.40కు పైగా భారం పడుతోందని వ్యాపారులు, ఎగుమతిదారులు ధర తగ్గించేశారు. రెండు వారాల పాటు మంచి ధర లభించడంతో సాగుదారులు ఆదాయం బాగా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. రెండ్రోజుల్లో కొయ్యలు పట్టడానికి ఏర్పాట్లు చేసుకున్న వారు తాజాగా ధరల పతనం చూసి ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున ఆదాయం కోల్పోతున్నారు.

Languages

Shares

Related News