రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ , మత్స్యశాఖ మంత్రిఆదినారాయణ రెడ్డిని అమరావతిలో జిల్లా రొయ్యరైతులు బుధవారం కలిసి విన్నవించారు. అంతర్జాతీయంగా విదేశాలకు ఎగుమతి చేసే రొయ్యల ధరలు ఏమాత్రం తగ్గకున్నా ఇక్కడి వ్యాపారులు సిండీకేటై రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తునారని ఫిర్యాదు చేశారు. జిల్లాలో రొయ్యల సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతు సంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాధ్ మంత్రికి వివరించారు.జిల్లాలో 27 వేల ఎకరాల్లో రొయ్యల సాగుచేస్తుండగా ఏటా 40 వేల టన్నుల రొయ్యలను ఉత్పత్తిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వ్యాపారులు సిండికేటై కేజీకి అంటే కౌంటుకు 100 రూపాయలనుంచి రూ. 150 వరకు తగ్గించి రొయ్యలను కొనుగోలు చేస్తుండటంతో రైతులు త్రివ్రంగానష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన రొయ్య మేత , ఇతర మందుల ఖర్చులను దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రస్తుత ధరలు మేత ఖర్చులకే సరిపోవడం లేదనిమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఎకరాకు రూ. 2లక్షల్ నుంచి రూ. 4 లక్షల వరకు పెట్టుబడిపెట్టి నష్టపోవాల్సి వస్తొందన్నారు. రొయ్య 100 కౌంటు 2017 లో రూ. 300 ఉండగా 2018జనవరిలో రూ. 250 తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం కిలో రూ. 170 పడిపోయిందన్నారు.సమస్యనుప్రభుత్వం దృసఃటికి తీస్సుకెళ్లిరొయ్య రైతులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు . కోస్టల్ ఆక్వా ఆధారిటీ ఆధారిటీఅనుమతిలేకుండా నాసిరకం మందులు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్న వ్యాపారులపై చట్టపరమైనచర్యలు తీసుకోవాలని కోరారు .స్పందించినమంత్రి.. మంత్యశాఖ ప్రింసిపల్ సెక్రటరీ గోపాలకృసఃటా త్రివేదినిపిలిపించి సమస్యను పరిష్కారించాలని ఆదేశించారు.
Source : sakshi