భారతదేశం నుంచి 2020వ సంవత్సరం నాటికి 10 బిలియన్ డాలర్ల (రూ.66,500కోట్ల) సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయాలని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల సంస్ధ లక్ష్యంగా పెట్టుకుంది.దీన్నిసాధించడానికి ఆంధ్రప్రదేశ్ పైనే ఆశలు పెట్టుకుంది.మొత్తం సముద్ర ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా 40 శాతం. రొయ్యల ఎగుమతుల్లో అయితే 70 శాతానికి పైగానే ఉంది.రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి ముఖ్యమత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో సరికొత్త విధానాలను అందుబాటులోకి తేవడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆక్వాజోన్లుగా ప్రకటించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆలోచన . ఇక్కడి రైతుల అవసరాలకు వీలుగా ఒక హేచరీ ,ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తారు. నాణ్యమైన విత్తనం సరఫరా చేయడంతో పాటు ,ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రాసెస్ చేసే వ్యవస్ధలను అందుబాటులోకి తెస్తారు. సాగు మొత్తం నిపుణుల పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఆక్వాజోన్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో సర్వే చేశారు.
రెండు సంస్ధల ఏర్పాటు : విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తల్లిరొయ్యల నాణ్యతను పరిశీలించడానికి చెన్నైలో మాత్రమే ఆక్వాటిక్ టైన్ కేంద్రం ఉంది విశాఖ ,నెల్లూరుల్లో రెండు ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా కోసం బ్రూడ్ స్టాక్ మల్టిఫ్లికేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
మత్స్యరంగ అభివృద్ధి ఏపీనే కీలకం: దేశంలోమత్స్యరంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారనుంది. ఇప్పటికే దేశం నుంచి అత్యధిక ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి.దేశంలో అత్యుత్తమ మత్స్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోంది.
source: ఈనాడు