విజయవాడలోని ఎల్ బీజీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎగ్జిబిషన్ కు ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి 200 మందితో కూడిన ఆక్వా రైతుల బృందం ఇక్కడ నుంచి బయలుదేరివెళ్ళింది. ఒంగోలు , సింగరాయకొండ, దర్శి , చీరాల నుంచి 50 మంది చొప్పున 200 మంది మత్స్యకారులు బయలుదేరి వెళ్లారు.ఆయా ప్రాంతాలకు చెందిన ఫిషరీస్ డెవలప్ మెంట్ అధికారుల ఆధ్వర్యంలో రైతు బృందాలు బస్సుల్లో విజయవాడకు వెళ్లింది.ఈ ఎగ్జిబిషన్ లో ఆక్వా రంగానికి సంబంధించిన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటుచేశారు. ఆక్వా రంగానికి చెందిన శాస్త్రవేత్తలుపాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. .
Source : ennadu