For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యకు ' కోవిడ్ ' దెబ్బ

img

పతనమైన ధరలు..
కుదేలవుతున్న రైతులు
అమరావతి : ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రొయ్యల సాగు రైతులు .. కోవిడ్ ( కరోనా) వైరస్ దెబ్బకు కుదేలవుతున్నారు. చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది. కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఒక్క కృష్టా జిల్లాలోనే 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతోంది. ఈ రొయ్యలను ఆక్వా రైతుల నుంచి వివిధ కంపెనీలు కొనుగోలు చేసి , ప్రాసెసింగ్ అనంతరం చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సహా యూరప్ కు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో ఉత్పత్తయున రొయ్యల్లో 90 శాతం విదేశాలకే  ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండడంతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో మనదేశం నుంచి విదేశాలు రొయ్యల దిగుమతికి ఆసక్తి చూపడం లేదు . దీంతో కొనుగోలు కంపెనీలు రొయ్యల ధర తగ్గించేస్తున్నాయి. ఇలా ఇప్పుడు రొయ్యల సైజు/ కౌంటును బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గిపోయింది.చిన్న రైతుల వద్ద అయితే ప్రస్తుత ధరల కంటే కౌంటుకు మరో రూ.20 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రొయ్యల రైతు నష్టాల పాలవుతున్నాడు. కొన్నాళ్లుగా వైరస్ సోకి రొయ్యల సాగు నష్టాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది వైరస్ బెడద లేకపోవడంతో ఆక్వా రైతు సంతోషపడుతున్న తరుణంలో కరోనా వైరస్ వారిని దెబ్బకొట్టింది.
మేత ధరలు మోత..
    ఒక వైపు రొయ్యల ఎగుమతులు తగ్గి ధరలు క్షీణిస్తుండగా మరో వైపు రొయ్యల మేత ధరలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం వరకు 25 కిలోల మేత (ఫీడ్) బస్తా రూ. 2,100 ఉండేది. ప్రస్తుతం అది రూ. 2,230 కి పెరిగింది.వీటితో పాటు ఇతర కెమికల్స్ , ప్రొబయోటిక్స్ వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. విదేశాల నుంచి రొయ్యల మేత దిగుమతులు తగ్గడమే వీటి ధరలు పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నాయి.
Source : Sakshi
 

Languages

Shares

Related News