For Advertisement Enquiries Please Contact +91 7901268899

అనుమతి ఉంటేనే 'ఆక్వా సాగు'!

img


అనుమతి ఉంటేనే 'ఆక్వా సాగు'!
రొయ్యల చెరువులు సాగు చేసే రైతులు కోస్తా ఆక్వాకల్చర్ ఆథారిటీ (సీఏఏ), మత్స్య శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధనను తప్పనిసరిగా అమలుచేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని చెరువుల్లో పండించిన రొయ్యల్ని వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు కొనుగోలు చేసి ఎగుమతిదారుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. ఇక నుంచి లైసెన్సు పొందిన చెరువుల్లో సాగు చేసిన రొయ్యలనే కొనుగోలు
చేయనున్నారు.
జిల్లాలో ఆక్వా అత్యంత కీలక రంగం. ఏపీ నుంచి విదేశాలకు ఏటా ఎగుమతి అవుతున్న రొయ్యల్లో 20 శాతం వాటా జిల్లా నుంచి ఉంటుంది. ఇంతటి కీలక రంగాన్ని వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు, నిబంధనలతో దారుణంగా దెబ్బతీసింది. విద్యుత్తు రాయితీ ఇవ్వడానికి ఆక్వా, నాన్ ఆక్వా జోన్ అంటూ అడ్డగోలు నిబంధన తీసుకొచ్చింది. నాన్ eseng జోన్లోని రొయ్యల చెరువులకు రూపాయిన్నరకు విద్యుత్తు సరఫరా చేయలేదు. రైతుల ముక్కుపిండి అధిక విద్యుత్తు ఛార్జీలు వసూలు చేసింది. యూనిట్కు రూ. 6కు పైగా చెల్లించాల్సి రావడంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు. రొయ్యల మేత, ఔషధాల ధరలు అమాంతం పెంచేసినా కంపెనీలతో కుమ్మక్కై మిన్నకుండిపోయింది.
46 శాతం చెరువులకే.. జిల్లాలో రొయ్యలు సాగు చేస్తున్న చెరువుల్లో 46 శాతానికి మాత్రమే సీఏఏ లేదా మత్స్య శాఖ నుంచి అనుమతి ఉంది. మిగిలిన వాటికి అనుమతి లేదు. ఆసైన్డ్, ప్రభుత్వ భూముల్లో సాగుచేసేవారు అనుమతి తీసుకోలేకపోయారు. అటవీ, మడ అడవుల భూములు మినహా ఇతర ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వి రొయ్యలు సాగుచేస్తున్న రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, తద్వారా కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చేయాలని మత్స్య శాఖాధికారులు భావిస్తున్నారు. యూనిట్ విద్యుత్తు రూపాయిన్నరకే అందాలంటే సాగుదారులు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
లైసెన్సు తప్పనిసరి.. 'అనుమతి లేని చెరువుల్లో ఆక్వా సాగుకు విద్యుత్తు బిల్లులపై ప్రభుత్వం నుంచి రాయితీ అందదు. పట్టా భూముల్లోని రొయ్యల చెరువులకు సీఏఏ, మత్స్య శాఖ ద్వారా లైసెన్స్ తీసుకోవాలి. ఆసైన్డ్, ప్రభుత్వ, సొసైటీ భూముల్లో చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సాగు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి' అని మత్స్య శాఖ డీడీ గాలిదేవుడు పేర్కొన్నారు.
జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం: 21వేల ఎకరాలు
మత్స్య శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించిన చెరువులు: 9832 ఎకరాలు
రిజిస్ట్రేషన్ లేకుండా అనధికారికంగా సాగు చేస్తున్నవి. 11,988 ఎకరాలు 

విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్యలు: 32 వేల మెట్రిక్ టన్నులు 

ఎగుమతుల ద్వారా 2024-25లో వచ్చిన ఆదాయం: రూ.1175 కోట్లు

Languages

Shares

Related News