ఒంగోలు : రొయ్యల మేత ధరలను వెంటనే తగ్గించడంతో పాటు , ఎగుమతి దారులు గత పది రోజుల కాలంలో తగ్గించిన రొయ్యల ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు .ఈ సందర్బంగా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ మాట్లాడుతూ ..రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని రొయ్యల మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు .డీకే పట్టా రొయ్యల చెరువులకు గతంలో చేసినట్లు లైసెన్సుస్ పునరుద్దరించాలని కోరారు .జిల్లా లోని హేచరీల్లో నాణ్యమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు .అనంతరం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు . కార్యాక్రమంలో జిల్లా రొయ్య రైతుల సంఘం , రైతు సంఘం నాయకులూ దివి హరిబాబు , నార్నె సతీష్ బాబు , బత్తుల రమేష్ రెడ్డి , అల్లూరి సత్యనారాయణ రాజు , సింగం నేని అంజిబాబు , ఎం .వెంకటేశ్వర్లు , దాచురి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు .
source : eenadu