For Advertisement Enquiries Please Contact +91 7901268899

రూకలు మింగిన రొయ్య...

img

రొయ్యల సాగు గాలిలో దీపంలా మారింది... కాలం కలిసి వస్తే కాసుల పంటే. తేడా వస్తే ... రొయ్య కంటిక కనబడదు. పెట్టుబడులు నీళ్లలో పోసినట్లే . సాగులో ప్రతికూల పస్ధితులు.. మార్కెట్లో ధరలు పడిపోవడం కారణంగా రైతులు కుదేలయ్యారు. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్తగా సాగు ప్రారభించేందుకు సాహసించడంలేదు. కొందరు రైతులు ఇప్పటికే ఆర్ధికంగా బాగా చితికిపోయారు. ఈ సీజన్లో ఎకరానికి సగటున రూ. 1.5 లక్షల చొప్పున మెత్తం 27 వేల ఎకరాల్లో రైతులురూ. 400 కోట్లకు పైగా నష్టాలను చవి చూడాల్సివచ్చింది. 
వనామీ రొయ్య సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఒడిదొడికులను ఎదుర్కొంటున్నారు. రొయ్య పిల్లలను చెరువులో వదిలిన వారం రోజుల్లోనే చనిపోతున్నాయి. రైతులు భయంతో నెల రోజుల లోపే సరైన కౌంటు  వరకు ఎదగకుండానే చెరువుల నుంచి పంటను తీసేస్తున్నారు. తీర ప్రాంతంలో ఆక్వా సాగుకు గుండ్లకమ్మనది , బకింగ్ హాం కాలువ నుంకి నీటిని నింపుతారు. ప్రస్తుతం చెరువులో సెలైనీటీ 15 నుంచి 25 ఉంటే రొయ్య పిల్లలు బాగా పెరుగుతాయి. కానీ రెండెళ్లుగా సరిపడ వర్సకాలు లేక.. ఉప్పునీటి శాతం 45 వరకు పెరిగిపోయింది. దీనికి తోడు ఎండతీవ్రత అధికంగా ఉండటంతో వ్యాఅధులు విజృంభిస్తున్నాయి. ఇటీ వల కాలంలో వనామీరొయ్యలకు రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్, తెల్లమచ్చ, మొప్ప తెగుళ్లు , వ్యాధులు సోకి నెల రోజుల్లోనే మృత్యువాత పడుతున్నాయి. వ్యాధుల వల్ల మేత తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల ఎదుగుదల కూడా లోపిస్తుంది. 100 కౌంటుకు కూడా రాకుండానే రొయ్య పిల్లలు చనిపోతుండటంతో రైతులుభారీగా నష్టపోతున్నారు. గతంలోఎకరానికి మూడు లక్షల రొయ్య పిల్లలనువదిలేవారు.. ప్రస్తంతం అందులో సగం పిల్లలను కూడాపెంచడానికి సాహసించలేకపోతున్నారు. వీటన్నింటి వల్ల ఎకరానికి సరాసరి రూ. 1.50 నుంచిరూ. 2 లక్షలవరకు నష్టపోతున్నారు.ఇలా కోల్పోయిన మొత్తం ప్రస్తుత సీజన్లోనే రూ. 400 కోట్లు దాటిందని అంచనా.
సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో ఇటీవల జరీగిన సమావేశంలో కిలో రూ. 30 చొప్పున పెంచి కొనుగోలుచేసేందుకు ఎగుమతిదారులు అంగీకరించారు . కానీ ఇది క్షేత్ర స్ధాయిలో అమలైతేనే రైతుకు కొంత ఊరట.
Source: eenadu

Languages

Shares

Related News