For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆరోగ్య రొయ్య

img

  టంగుటూరు : రొయ్యల్లో విష రసాయనాలు పెరిగాయి … మి రొయ్యలు మాకొద్దు … యాంటీబయోటిక్స్ విపరిమితంగా వాడుతున్నారు .భారత్ నుంచి వచ్చే వి  దిగుమతి చేసుకోవద్దని ప్రకటనలు  రైతులను కలవర పెడుతున్నాయి . యూరోపియన్ దేశాలకు ఒక్కసారిగా ఎగుమతులు ఆగిపోయాయి . ధరలు పతనమై రొయ్యను నమ్ముకున్న రైతు చితికి పోతుంటాడు  డాల్లర్లు కురిపించే రొయ్య . రైతును ముంచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి .. పంట కాలం పూర్తయ్యే వరకు రొయ్యలు ఆరోగ్యంగా ఉంటె రైతులు అదృష్టవంతులే, ఒక వేళ ప్రతికూల పరిస్ధితి ఎదురైతే రైతుల జీవితాలు తలకిందులవుతాయి .. ఈ పరిస్ధితుల నుంచి బయట పడేందుకు ఇప్పుడు కొంత మంది ఆక్వా రైతులు సేంద్రియ పద్ధుతులకు శ్రీకారం చుట్టారు . ఆరోగ్యం టూ పాటు లాభాల పంట పండిస్తున్నారు . మిగిలిన రైతులకు సుపూర్తిగా నిలుస్తున్నారు . రెండేళ్లు గా సేంద్రియ రొయ్యల సాగుతో ముందుకు పోతున్నా రైతుల గురించి …

సాగుకు శ్రీకారం

వెనామికి  వంటింటి చిట్కా

జిల్లాలో 25 వేల  ఎకరాల విస్తర్ణముతో రొయ్యల చెరువులు విస్తరించి న్నాయి. విటిపై వేలాది కుటుంబాలు ప్రత్యక్షముగా , పరోక్షముగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి . వెనామీ సాగులో వైరస్ ల విజృంభణతో గత నాలుగేళ్లుగా ఆక్వా రైతులు పడుతున్నా పాట్లు వర్ణనాతితం , వైట్  గట్  వైట్ స్పాట్ ,లూషియల్  వంటి వ్యాధులు సోకడంతో చెరువులు తుడిచి పెట్టుకు పోతున్నాయి . దీని  నుండి బయట పడేందుకు వంటింటి చిట్కాలు  అవలంబిస్తూన్నారు . బెల్లం , పసుపు , వెల్లుల్లి వంటి పదార్ధాలను ఉపయోగిస్తున్నారు .రసాయనిక ఎరువులు , యాంటీఇబయోటిక్స్ కు బదులుగా జీవామృఊతాన్ని వినియోగిస్తున్నారు .ఒంగోలు కు చెందిన తీయుట వెంకటరమణ , ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి హరిబాబు , మోటుమాల , పసుకుదురు గ్రామాల్లో తమకు ఉన్న రొయ్యల చెరువుల్లో జీవామృతాన్ని ప్రయోగాత్మకంగా వాడి చూశారు .మంచిదిగుబడులు వచ్చాయి .

మోతాదు మించిన ఫరవాలేదు ….

హెక్టారు చెరువులో ఒకసారి చల్లడానికి 200 లీటర్ జీవామృతం సరిపోతుంది . డ్రమ్ముల్లో 10 లీటర్ల  ఆవు మూత్రం , పది కిలోల పేడ కలిపి రెండు రోజుల పాటు డ్రమ్ముల్లో ఉంచాలి .   ఉదయం , సాయంత్రం అయిదు నిముషాల పాటు సవ్య దిశలో తిప్పాలి . అనంతరం చెరువుపై ప్రోబయోటిక్స్ ను ఏవిధంగా చల్లుతామో  ఆవిధంగానే జీవామృతాన్ని ప్రతి మూడు రోజులకొకసారి చల్లాలి . మోతాదు మించిన నష్టం లేదు . ప్రతి రోజు కిలో రొయ్యల మెటాలో తగినంత ఆవు మూత్రం కలిపి చల్లాలి . వారానికి రెండు రోజులు పది గ్రాముల పసుపును కిలో వెల్లులి పేస్ట్ తో కలిపి చెరువు న్నిటిపై చల్లడంవల్ల తెగుళ్ల నుంచి రొయ్యలను కాపాడవచ్చు.

Source : eennadu     

Languages

Shares

Related News