For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించాలి

img

రొయ్యల రైతులకు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు . ఆదివారం ప్రెస్ క్లబ్ లో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ అధ్యక్షతన  జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘుల నాయకులు , రొయ్యల సాగు రైతులు పాల్గొన్నారు . గోపీనాద్ మాట్లాడుతూ  రొయ్యల ఎగుమతిదారులు కూటమి కట్టి ధరలు గణాన్నియంగా తగ్గించి వేశారన్నారు . ప్రభుత్వం జోక్యం చేసుకుని సాగు ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు ఇప్పించాలని డిమాండ్ చేశారు పెట్టిన పెట్టుబడి రాక.... రైతులు త్రీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు . రొయ్యల రైతుల సంఘం అధ్యక్షడు అన్నెం కొండల రాయుడు మాట్లాడుతూ  జిల్లాలోని కొన్ని హెచ్చరిల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని ఆరోపించారు . తల్లి రొయ్యలకు నాసిరకం మెటా , యాంటీబయోటిక్స్ వాడటంతో నాసిరకం పిల్లలు ఉత్పత్తి అవుతున్నారు అన్నారు . వాటినే రైతులు తీసుకువఛ్చి  చెరువుల్లో వదులుతుండగా ఎదుగుదల లేక వ్యాధులకు గురవుతున్నాయన్నారు బతుకుదలశాతం తక్కువగా ఉంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . రైతు సంఘం జిల్లా అధ్యక్షడు మండవ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాసిరకం ఉత్పత్తి జరగకుండా చూడాల్సిన మత్య్సశాఖ , ఎంపెడా , కోస్టల్ ఆక్వా అథారిటీలు ఆ దిశగా కాణికిస చర్యలు టిఇసుకోవడం లర్థని ఆరోపించారు . ఇదే పరిస్ధితి కొనసాగితే ... జిల్లాలో రైతుల సాగు నుంచి తప్పుకొని పరిస్ధితి ఏర్పడుతుందన్నారు . ప్రభుత్వం తక్షణం స్పందించి రొయ్యల ఎగుమతిదారులతో మాట్లాడి గిట్టుబాటు ధరలు ఇప్పించాలని కోరారు . ఆచార్య రంగా కిసాన్ సంస్ధ ప్రధాన కార్యదర్శి చంచు శేషయ్య మాట్లాడుతూ నాసిరకం రొయ్య పిల్ల ను ఉత్పత్తి చేస్తూన్న హేచరీయులపై చర్యలు తిసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధుల ఆర్ . సురేష్ బాబు , అంజిబాబు , లక్ష్మణ రావు , ఓ పీడీఆర్  రాష్ట్ర అధ్యక్షడు చావలి సుధాకర్ , జి. నరసింహారావు , కొంగర నరసింహం తదితరులు పాల్గొన్నారు .       

ssource : eenadu

Languages

Shares

Related News