లాక్ డౌన్ సమయంలో ఆక్వారంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని... విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక నష్టాలను మూటగట్టుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు . గడువు తీరిన 242 ఆక్వా హేచరీల రిజిస్ట్రేషన్ గడువును 3 నెలలు పొడిగించామన్న ఆమె .. వ్యక్తిగత బొట్లు , మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు . మత్స్య సంపద యోజన కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నాయని మత్స్య రంగంలోని 55 లక్షల మందిని ఆదుకుంటామన్నారు .