రొయ్య రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు . కొద్ది పాటి సమస్యలున్నా ....మంచి ధర పలుకుతుండటంతో లాభాలు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు . డివిజన్లలోని తీర ప్రాంత మండలాలైన టంగుటూరు , సింగరాయకొండ , ఉలవపాడు , గుడ్లూరు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి .వీటిలో వెనామీ రకాన్ని రైతులు సాగు చేసున్నారు .ఈ ప్రాంతాల్లో ఇప్పుడిపుడే అమ్మకాలు ప్రారంభం అయ్యాయి .పది రోజుల క్రితం వరకు కిలో రూ .300 వరకు పలికింది .ఇప్పుడు రూ .20 తగ్గింది . అయినా పంట ఆశాజనకంగా ఉండటంతో లాభాలు వస్తాయని సాగుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . గుడ్లూరు మండలంలోని కర్లపాలెం , ఆవులవారి పాలెం , మొండివారిపాలెం , రామాయపట్నం , సాలిపేట ప్రాంతాల్లో చెరువుల్లో రొయ్యలను పడుతున్నారు .వీటిని చెన్నై , నెల్లూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు . చివరి దశలో చెరువు నుంచి తీసిన వాటిని కూడా ఎగుమతి చేస్తుండటం విశేషం .
source : eenad