ఆక్వా సాగు పతనమవుతోంది . చేపలతో పాటు రొయ్యనూ కష్టాలు కమ్మేశాయి . ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి .లాక్ డౌన్ ప్రారంభంతో రొయ్యల కొనుగోలు ఒక్కసారిగా నిలిచింది .ప్రాసెసింగ్ ప్లాంట్లు మూతపడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు . సడలింపుల తర్వాత పాక్షికంగా ప్లాంట్లు తెరిచారు . కొనుగోలు మొదలైందనుకునే సమయంలో జులై మొదటి వారం నుంచి మళ్ళీ కష్టాలు చుట్టుముట్టాయి . జులై మొదటి వారంతో పోలిస్తే మూడో వారానికి 100 కౌంటు రొయ్యల ధర కిలో కు 100 కౌంటు రొయ్యల ధర కిలోకు రూ 110 తగ్గింది .ఎకరా సాగు చేస్తే రూ .2 లక్షల వరకు నష్టాలు తప్పడం లేదు ఏడాదికి రూ. 50 వేల కోట్ల జీవీ ఏ అందించే మత్స్య రంగం భవిష్యత్తే ప్రశ్నర్థకమైంది .
దెబ్బతీస్తున్న తెల్లమచ్చ
వానాకాలం కావడంతో రొయ్యలను తెల్లమచ్చ వైరస్ ఆశిస్తోంది .కృష్టా జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ . ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఇది విస్తరిస్తోంది . రొయ్య పిల్లలు వేసిన 25 రోజులకే వైరస్ ఆశించడంతో నాలుగెకరాల చెరువును వదిలేయాల్సి వచ్చిందని ఓ రైతు వాపోయారు .విత్తనం వేసే సమయంలోనే పీసీఆర్ పరీక్ష చేయించడంతో పాటు నీటిని వదిలాక 25 నుంచి 30 పీపీఎం బ్లీచింగ్ తో శుద్ధి చేయాలని విశ్రాంత శాస్త్రవేత్త రామ్మోహన్ రావు సూచించారు .
రాష్ట్రంలో సుమారు 70 వరకు రొయ్యల శుద్ధి ప్లాంట్లున్నాయి . వాటిల్లోని సిబ్బంది కొందరికి కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో ఒక్కొక్కటిగా మూసేస్తున్నారు .
40 % తగ్గిన ఎగుమతులు
రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 90% చైనాతో పాటు అమెరికా , జపాన్ , ఐరోపా , దేశాలకు ఎగుమతవుతాయి . అయితే కోవిడ్ పరిణామాలతో మార్చి నుంచి మందగమనం మొదలైంది . గతఏడాది ఏప్రిల్ - జూన్ తో పోలిస్తే ఈ ఏడాది 40 % ఎగుమతులు తగ్గాయని ఆనంద గ్రూప్ రామకృష్ట రాజు పేర్కొన్నారు .
source : eenadu