ఆక్వాలో విచ్చలవిడిగా నిషేధిత యాంటిబయోటిక్స్ వాడకాన్ని నియంత్రించాలి. మందుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి చేయాలి. బయట అమ్మకాలు నిలిపివేయాలి. ధ్రువీకరణ లేని హేచరీస్ను సీజ్ చేయాలి. అని మత్స్యరంగంపై ఏర్పాటైన ఎపెక్స్ కమిటీ నిర్ణయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించినసమావేశంలో మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి , కలెక్టర్లు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. .ఈ సందర్భంగా రొయ్యలు, చేపల సాగు , హేచరీస్, కాలుష్యం, అనుమతులు తదితరఅంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు : నల్సార్ విశ్వవిద్యాలయ సహకారంతో ఆక్వా చట్టం రూపకల్పన.
1. సాగుపై అవగాహన కోసం ఆక్వా రైతుల్ని ధాయ్ లాండ్ , మలేషియా, కాంబోడియా తీసుకెళ్లాలి.
2. ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలను ఆక్వాజోన్ గా ప్రకటించి అన్ని సౌకర్యాలు కల్పించాలి.
3. గతంలో దక్షిణకొరియాలో ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదిరింది. దీన్ని సమీక్షించాలి.
4. హేచరీస్ పక్కపక్కనే ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయి. వీటీని క్రమబద్ధీకరించి గ్రేడింగ్ ఇవ్వాలి.
5. పశు సంవర్దక , ఆక్వా వేర్వేరు చేసి డ్రగ్ కంట్రోల్ కింద దుకాణాలకు అనుమతి తీసుకునేలా చూడాలి.
6. ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు.
7. యాంటిబయోటిక్స్ గుర్తించడం, ఏ మందు ఎవరు వాడుతున్నారు , ఎక్కడికి వెళ్తుంది , బిల్లుల తయారీపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి.
Source : ennadu