ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో , 1990 దశకమ్లో రొయ్యల పెంపకానికి విపరీతమైన ఆధరణ లభించింది.వ్యవసాయంతో పోలిస్తే , నష్ట భయం ఉన్నప్పటికీ , లాభదాయకత ఎక్కువగా ఉండుట వల్ల, ఆక్వా కల్చర్ ద్వార రొయ్యల పెంపకానికి రైతులు ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించారు. ఫలితంగా నీటికి కరువు లేని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక వ్యవసాయ క్షేత్రాలు రొయ్యల చెరువులుగా మారాయి. కేవలం నాలుగు నెలల కాలంలో పంట చేతికి వస్తుండటం , ప్రతిఫలం ఎక్కువగా లభిస్తుండటం వల్ల , రొయ్యల పెంపకం క్రమంగా పరిశ్రమ రూపుదాల్చి, నేడు యావత్తు రాష్ట్రానికే ఆశాజనకంగా నిలుస్తుంది.
1994 సంవత్సరంలో , ఆక్వాపరిశ్రమను కుదేలు చేసిన దుస్సంఘటన ఇంకా రైతులు మది నుండి చెరిగిపోలేదు ఆకర్షణీయమైన రంగులో పెద్ద సైజులో లభించు టైగర్ రొయ్యలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైగర్ రొయ్యల పరిశ్రమ తెల్ల మచ్చ వ్యాధి వైరస్ కారణంగా కుప్పకులిపోయింది. చాలా మంది రైతులు ఆక్వా కల్చర్ ను విడిచి పెట్టి ఇతర మార్గాలను అన్వేషించవలసి వచ్చింది. ఇటువంటి తరుణంలో ఫసిఫిక్ సముద్రంలో లభించు వన్నమై రొయ్యల పెంపకానికి 2009 సంవత్సరంలోకేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో, ఆక్వాపరిశ్రమ నూతనోత్సాహంతో పుంజుకుంది.
నర్సరీ అంటే :
రొయ్యల పెంపకంలో హేచరీ మరియు గ్రో అవుట్ మధ్య పెంపక దశను నర్సరీ దశగా చెప్పవచ్చు . సాధారణంగా హేచరీలలో ఉత్పత్తి అయిన పోస్టు లార్వా దశ రొయ్య పిల్లలను నేరుగా పెంపక చెరువులో స్టాకింగ్ చేయడం జరుగుతుంది. ముడంచెల పెంపక విధానంగా పరిగణించబడే నర్సరీ పెంపకంలో , హేచరీల నుండీ కొనుగోలు చేసిన 0.2- 0.5 గ్రాముల బరువు గల PL 10 -15 దశ రొయ్య పిల్లలను తీసుకువచ్చి , వాటిని 25 – 30 రోజుల పాటు పెంపకం చేసి, ఉత్పత్తి అయిన సగటున 2 గ్రాముల బరువు గల రొయ్య పిల్లలను పెంపక చెరువులో స్టాకింగ్ చేయవలసి ఉంటుంది.
ప్రయోజనాలు :