For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర

img

అమరావతి : వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు నిర్ణయిస్తున్న విధంగానే రొయ్యలు , చేపలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించనుందని రాష్ట్ర మత్స్య , పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు . సీఎం వైస్ జగన్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు. మంగళవారం విజయవాడలోవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ..దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులు సాగు ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందన్నారు . ఇదే తరహాలో రొయ్యలు , చేపలకు మద్దతు ధరను ప్రకటించనుందని చెప్పారు . ఇంకా ఏమన్నారంటే .. త్వరలో ఆక్వా అథారిటీ 1 . రొయ్యలు , చేపల ధరలు ఇతర రాష్ట్రాల్లో ఏసమయాల్లో ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాం . ఆక్వా ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పిస్తాం . 2. చేపలు , రొయ్యల పెంపకాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తాం . ఇది పొగాకు బోర్డు తరహాలోనే ఉంటుంది . 3 . లాక్ డౌన్ తో ఆక్వా రైతులు నష్టపోయే పరిస్ధితులు తలెత్తినా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడంతో రైతులు లబ్ది పొందారు . source : sakshi

Languages

Shares

Related News