కత్తిపూడి – ఒంగోలు మార్గంలోని మచిలిపట్నంలో డీప్ వాటర్ పోర్టు పారిశ్రామిక నడవా మంజూరైంది. 33 వేల ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి సమీకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నర్సాపురం సమీపంలోనూ పోర్టు మంజూరైంది.
కాకినాడ , అమలాపురం , రాజోలు, నర్సాపురం, మొగల్తూరు, చినగంజాం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, చీరాల, తదితర ప్రాంతాల్లో భారీగా ఆక్వా సాగవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. చేపలు , రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటి స్ధానంలో ఉంది. రెండంకెల వృద్ధి రేటు సాధిస్తోంది ఈ రంగంమే కావడం విశేషం.2019-20 నాటికి 42 లక్షల టన్నుల మత్స్య సంపద దిగుబడి సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. 17 వేల కోట్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రాష్ట్రం నుంచి జరుగుతున్నాయి. సాధనలో ఈ ప్రాంతాలు కీలకం కానున్నాయి.
Source: ఈనాడు