ఏంది'రొయ్య' ఈ దారుణం!
ఈనాడు, ఒంగోలు: టంగుటూరు మండలం పసుపుముద్ర (పసుకుదురు) గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరాన్ని ఆనుకుని ఇలా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. సీఆర్కెడ్ (కోస్టల్ రెగ్యులేటరీ జోన్) నిబంధనల ప్రకారం తీరానికి వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. చేపలు, రొయ్యల చెరువులు తవ్వకూడదు. ఇక్కడ మాత్రం తీరాన్ని ఆనుకునే పదుల సంఖ్యలో రొయ్యల చెరువులు తవ్వి... మోటార్లతో నీటిని తోడుతున్నారు. ఆయా చెరువుల్లో పెద్ద ఎత్తున రసాయనాలు, యాంటీబయాటిక్స్ మందులు వినియోగిస్తున్నారు. ఈ వ్యర్థాలు, మురుగును మళ్లీ సముద్రంలోకే వదిలేస్తున్నారు. దీంతో సముద్ర జలచరాలకు ముప్పు తలెత్తుతోంది.