అమరావతి : టైగర్ రొయ్యల సాగుకు డిమాండ్ పెరుగుతుండంతో కొన్ని ప్రవైట్ హేచరీలు నాణ్యత లేని , నకిలీ సీడ్ ను ఉత్పత్తి చేస్తూ రైతుల్ని నిలువునా ముంచుతున్నాయి .సముద్రపు టైగర్ రొయ్యల నుంచి ఉత్పత్తి చేసిన సీడ్ ను రైతులకు విక్రయిస్తూ హేచరీలు సొమ్ము చేసుకుంటున్నాయి . డిమాండ్ కు తగిన్నట్టుగా సీడ్ అందుబాటులో లేక పోవడంతో దళారుల ఉచ్చు లో పడి మోసపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఆదేశాలతో మత్స్య శాఖ రంగంలోకి దిగింది . అనుమతి లేకుండా టైగర్ సీడ్ ఉత్పత్తి చేస్తున్న హేచరీలను తనిఖీ చేస్తూ వాటిపై చర్యలకు ఉపక్రమిస్తోంది .విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వ్యాధి రహిత టైగర్ తల్లి రొయ్యల నుంచి సీడ్ ఉత్పత్తికి కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ అనుమతి ఇచ్చింది .
డిమాండ్ తగ్గట్టుగా సీడ్ ఉత్పత్తి లేక ...
రాష్ట్రంలో కేవలం 3,932 హెక్టార్లకు మాత్రమే పరిమితమైన టైగర్ రొయ్యల సాగు అనూహ్యంగా 20 వేల హెక్టార్లకు పైగా పెరిగింది . ప్రస్తుత అవసరాలకు 1500 మిలియన్ల సీడ్ అవసరం . విదేశాల నుంచి టైగర్ బ్రూడర్ దిగుమతి చేసుకుని వాటి నుంచి సీడ్ ఉత్పత్తి చేసేందుకు దేశంలో రెండు హేచరీలకు మాత్రమే సిఎ ఏ అనుమతి ఇచ్చింది . వాటిలో ఒకటి నెల్లూరులోని వైష్ణవి హేచరీ కాగా , రెండోది తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టు జిల్లా ముగయ్యుర్ వద్ద ఉన్న యూనిబియో హేచరీస్ కాగా , టైగర్ సీడ్ ఉత్పత్తికి అనుమతి పొందిన నెల్లూరు వైష్ణవి హేచరీ ఏటా 300 జతల ఎస్ పీ ఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటి ద్వారా 80 మిలియన్ల సీడ్ మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది . ఇప్పుడు బుక్ చేసుకుంటే కనీసం రెండేళ్లకు కానీ సీడ్ సరఫరా చేయలేని పరిస్ధితి ఇక్కడ నెలకొంది . దీంతో మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునే లక్ష్యం కొన్ని హేచరీలో సముద్రపు రొయ్యల నుంచి సీడ్ ఉత్పత్తి చేస్తుండగా .. కొందరు దళారులు ఆ హేచరీలో ఉత్పత్తి అయిన టైగర్ సీడ్ రెడీగా ఉందని రైతులను నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు .
రంగంలోకి దిగిన మత్స్య శాఖ
నకిలీ సీడ్ తో నష్టపోతున్న రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తతుండంతో అనుమతి లేకుండా బ్రూడర్స్ దిగుమతి , సీడ్ ఉత్పత్తి చేస్తున్న చేస్తున్న యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రాష్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ..రంగంలోకి దిగిన మత్స్య శాఖ రాష్ర వ్యాపంగా ఉన్న హేచరీల్లో విస్రృత తనిఖీలు చేస్తోంది . తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్త్తపల్లి మండలం కోనపాప పేటలోని సౌభాగ్య హేచరీలో అనధికారికంగా సముద్రపు టైగర్ రొయ్యల నుంచి ఉత్పత్తి చేసిన 23 లక్షల సీడ్ సముద్రంలో కలిపేశారు .ఒంగోలు ప్రాంతంలోని ఓ హేచరీలో అనుమతి లేకుండా టైగర్ సీడ్ ఉత్పత్తి అవుతున్నట్టుగా గుర్తించి .. ఆయా హేచరీలో చర్యలకు ఉపక్రమిస్తోంది .
Source : Sakshi
www.aquall.in