అంతర్జాతీయ మార్కెట్లో చక్కని గిరాకీ ఉన్న బొంతుచేప విత్తనాల ఉత్పత్తికి విశాఖపట్నంలోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్ధ ప్రాంతీయ కేంద్రం 20 ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలు ఫలవంతమయ్యాయి. బొంతుచేపను వాణిజ్యపరంగా సాగుచేయడానికి వీలుగా సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ అధికారులు ఈ పరిశోధనలు ప్రారంభించారు. సముద్రంలో పెరిగే బొంతుచేపకు దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.కిలో బరువుండే ఈ చేప ధర దేశీయ మార్కెట్లో రూ. 400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూ.1500 వరకు ఉంది. గిరాకీకి తగ్గట్టుగా ఎగుమతి చేయలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలో బొంతుచేప విత్తనాలను తయారు చేసి రైతులకు అందించగలిగితే సాగుకు వారు ముందుకొస్తారని. సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. అధికారులు భావించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఆరంభించిన ప్రయోగాలు 2013 లో పాక్షికంగా విజయవంతమయ్యాయి.కొద్ది మొత్తంలోనే విత్తనాలు ఉత్పత్తి అవుతుండడం అవరోధంగా మారింది.ఒకేసారి వేలాది విత్తనాలు ఉత్పత్తి చేయగలిగితేనే వాటిని వాణిజ్యపరంగా వినియోగించడానికి , తగిన సంఖ్యలో రైతులకు సరఫరా చేయడానికి వీలుంటుంది. దీంతో సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. సంచాలకుడు డా” గోపాలకృష్టన్ ఆద్వర్యంలో సీనియర్ శాస్త్రవేత్త శుభదీఘష్, మరికొందరు శాస్త్రవేత్తలు మూడేళ్లుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యారు. వారి కృషి ఫలించడంతో వేలాది బొంతుచేపల విత్తనాలు ఒకేసారి తయారుచేసే హేచరీకిరూపమిచ్చారు. వాటిలో విత్తనాలు సృష్టించే ప్రక్రియను కూడా ప్రయోగాత్మకంగా చేపట్టి పూర్తి స్ధాయిలో విజయం సాధించినట్లు నిర్ధరణ చేసుకున్నారు.
10% బతకడం రికార్డే
హేచరీల్లోఉత్పత్తయ్యే విత్తనల నుంచి కేవలం ఐదు నుంచి ఆరు శాతమే చిరుచేపలుగా మారుతాయి.మిగతావన్నీ లార్వా దశలోనే చనిపోతాయి . అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఆరు శాతంవిత్తనాలు చేపలుగామారితే మంచి విజయం సాధించినట్లే . విశాఖ అధికారులు రూపొందించినవిత్తనాల్లో ఏకంగా 10 శాతం వరకు విత్తనాలు చిరు చేపలుగా మారుతున్నటు రుజువైంది.
source : eenadu