రొయ్యల్లో నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకం ఎగుమతులకు ప్రతిబంధకంగా మారుతోంది . యూరోపియన్ యూనియన్ , అమెరికా , జపాన్ తదితర దేశాలు జనవరి నుంచి తనిఖీలు కఠినతరం చేయనున్న నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది . ఎనిమిదేళ్లలో పరిశీలిస్తే ... దేశవ్యాప్తంగా 176 రొయ్యల కంటెనర్లు తిరస్కరణకు గురయ్యారు , ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినవే 110 ఉండటం పరిస్ధితి తీవ్రతకు దర్పణం పడుతోంది . ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే తొమ్మిది కంటెయినర్లును తిరస్కరించారు . హేచరీకి స్థాయి నుంచే మందుల వాడకాన్ని నియంత్రించాల్సి ఉంది .దినిపై చర్యలు తీసుకునే అధికారం మత్స్యశాఖకు లేనందున నామమాత్రపు తనిఖీలతో నే సరిపెడుతోంది .
చేపల నుంచి రొయ్యల్లోకి ...
రొయ్యల చెరువుల్లోకి వివిధ రూపాల్లో నిషేధిత మందులు చేరుతున్నాయని అధికారులు గుర్తించారు. చేపల చెరువుల్లో పౌల్ట్రీ లిట్టర్ ను ఎక్కువగా వాడుతున్నారు. సాధారణంగా కోళ్ల రంగంలో యాంటిబయోటిక్స్ ఎక్కువ వాడుతారు. ఇవి లిట్టర్ ద్వారా చేపల చెరువుల్లోకి చేరుతుంది తర్వాత ఏడాది ఇందులోనే రొయ్యలసాగు చేపట్టడంతో అవశేషాలు వాటిలోకి వస్తున్నాయి.
అధికారమెంత ?
కోళ్ల రంగంలో అవసరాలకు తీసుకెళ్తున్నట్లు చూపిస్తూ ఆక్వా చెరువుల్లో వినియోగిస్తే తామేం చేయగలమని అధికారులు పేర్కొంటున్నారు , దింతో కేసుల నేమొదుకు అవకాశం లేకుండా పోతుంది . మరి కొంత మంది దుకాణాల్లో ఉంచకుండా జాగ్రత్త పడుతున్నారు . .హైదరాబాద్ నుంచి బస్సుల ద్వారా తెపించి నేరుగా రైతుల చెరువుల వద్దకు తీసుకెళ్తున్నారు . ఇంకొందరు దూరప్రాంతాల్లో ఉంచి యాంటీబయోటిక్స్ ఆహార భద్రతా చట్టం కిందకి తెచ్చ్చే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది . అది కార్య రూప దాల్చడం లేదు .
ఏడాది పాటు అలాగే ..
సాధారణంగా మందులు వాడితే వాటి ప్రభావం వారం , పది రోజుల ఉంటుందనే అభిప్రాయాలున్నాయి . కూరగాయల్లోనూ అలాగే మందు పిచికారీ చేశాక వారం తర్వాత కోట కోయాలంటారు . రొయ్య పిల్లల ఉత్పత్తికలోనూ ఇదే పరిస్ధితి పిల్లలు పెద్దయ్యేసరికి మూడు నుచి నాలుగు నెలల సమయం ఉండటంతో ఈలోగా తాము వాడిన యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గుతోందని వ్యాపారులు భావిస్తున్నారు . అయితే ఇది సరికాదని మత్స్యశాఖ డి డి సీతారామరాజు వివరించారు . క్లోరో పెనికల్ , నైట్రోఫూరన్స్ అనే రకం మందుల అవశేషాలు ఏడాది పాటు వాటి శరిఈరంలో ఉంటాయని చెప్పారు . విఐటిని వాడకుండా ఉత్పత్తి ఎలా చేయాలనే అంశంపై శిక్షణ నిర్వహిస్తున్నారు.